Breaking News

Daily Archives: January 20, 2020

మూడవ ర్యాండమయిజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ సిబ్బందికి సంబంధించి 3వ ర్యాండమైజేషన్‌ పూర్తి చేశారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్లో సాధారణ పరిశీలకులు ముషారఫ్‌ ఫరూకి ఆధ్వర్యంలో జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్‌ సిబ్బందిని కేటాయిస్తూ ప్రక్రియ పూర్తి చేశారు. 146 వార్డులకు గాను 621 పోలింగ్‌ స్టేషన్లకు 735 పోలింగ్‌ టీంలను కంప్యూటర్‌ ద్వారా ప్రక్రియ చేశారు. వారితో పాటు 88 మంది క్రిటికల్‌ సెన్సిటివ్‌ హైపర్‌ సెన్సిటివిటీ మరియు 97 మంది సూక్ష్మ పరిశీలకులను కేటాయించడానికి ...

Read More »

పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలను పాలిటెక్నిక్‌ కళాశాలలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్‌ రిసెప్షన్‌ కేంద్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డివిజన్‌ వారీగా డిస్ట్రిబ్యూషన్‌ కౌంటర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాలెట్‌ బాక్స్‌లు భద్రపరిచే రూమ్‌ను సందర్శించారు. అనంతరం మెటీరియల్‌ డిస్ట్రిబ్యూషన్‌ గదులను ...

Read More »

తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి బయంతో భారీ యెత్తున ఎలెక్షన్‌ అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. అభివ ద్ది పనులు చేయక, అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి దొంగ వొట్లతో ప్రజలను మోసగించాలని చూస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి ప్రజలను మోసం చేయడానికి కామారెడ్డిలో లేని వారి వోట్లు నమోదు చేసి తద్వారా ఎన్నికల్లో గెలుపొందాలనే పన్నాగం పన్నారన్నారు. సోమవారం ప్రచారం ముగిసిన అనతరం విలేకరులతో ...

Read More »

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూలు విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు అన్ని ముందస్తు చర్యలతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ రెండు రోజులకు మరింత పకడ్బందీగా ఎన్నికల ...

Read More »

ఎన్నికలు పారదర్శకంగా జరగాలి

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీలోని 49 వార్డులలో బోగస్‌ ఓట్ల విషయమై కామారెడ్డి గుడ్‌ సిటిజన్‌ ఫోరం తరఫున ఈనెల 18న ఆర్‌డివోకు వినతి పత్రం సమర్పించడం జరిగిందని న్యాయవాది రజనికాంత్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియ అయినటువంటి ఎన్నికలు అవినీతి రహితంగా, పారదర్శకంగా, ఓటర్లు సరైన అవగాహనతో తమ ఓటుహక్కు వినియోగించుకొని తద్వారా సాధికారతను సాధించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా ఓటర్ల ...

Read More »

5.5 లక్షల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ

రెంజల్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా 5.5 లక్షల గొర్రెలు, మేకలకు నట్టాలనివరణ మందులను వేయడం జరిగిందని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీఏ బాలిక్‌ హైమద్‌ అన్నారు. సోమవారం మండలంలోని సాటాపూర్‌, దూపల్లి గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల అందజేత శిబిరంలో పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్‌లు వికార్‌ పాషా, సాయరెడ్డి ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ విడత నట్టల నివారణ కార్యక్రమాన్ని ఈ ...

Read More »

జోరుగా ఎన్నికల ప్రచారం

బాన్సువాడ, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ పట్టణంలో తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికల ఇంచార్జీ బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. తెరాస ప్రభుత్వం వచ్చాక బాన్సువాడ పట్టణంలో కనీవినీ ఎరగనంత పెద్దఎత్తున అభివద్ధి జరిగిందన్నారు. భవిష్యత్తులో మరింతగా అభివద్ధి జరగడానికి తెరాస ...

Read More »

కార్పోరేటర్‌గా అవకాశం ఇవ్వండి

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరపాలక సంస్థ ఎన్నికల్లో 25 వ డివిజన్‌ నుండి సీపీఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీ అభ్యర్థిగా వనమాల కష్ణ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా 25 వ వార్డులో న్యూడెమోక్రసీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. 25 వ వార్డులోని అన్ని వీధుల్లో డప్పు వాయిద్యాలతో, నినాదాలతో వనమాల కష్ణను గెలిపించాలని న్యూడెమోక్రసీ కార్యకర్తలు అభిమానులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాల కష్ణ మాట్లాడుతూ గతంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి కార్పొరేటర్‌గా పనిచేసి ...

Read More »

పల్స్‌ పోలియో కేంద్రాల తనిఖీ

రెంజల్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి సుదర్శన్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు సబ్‌ సెంటర్‌ పల్స్‌ పోలియో కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆస్పత్రిలోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో ఉన్న బాలింతకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కిట్‌ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 93 శాతం పల్స్‌ పోలియో నమోదైందని పోలియో ...

Read More »

ఆటకెళ్లారు..ఆలోపే అనంత లోకాలకు…

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు గ్రామంలో విషాదఛాయలు రెంజల్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడిపాడే వయస్సులో ఉన్న ముగ్గురు చిన్నారి బాలురు ఆడుతూ..పాడుతూ.. ఆట బాట పట్టారు. పక్కనే ఉన్న లోతైన గుంతను గ్రహించలేరు మోటర్‌ సైకిల్‌ టైరుతో ఆడుకుంటూ గ్రామశివారు పక్కన ఉన్న అడవి నెరేడుపండ్ల కోసం వెళ్లారు. ఆట కోసం తెచ్చుకున్న బైక్‌ టైరు అక్కడే ఉన్న లోతైన గుంతలోకి పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి నీటితో నిండి ఉన్న గుంతలో పడింది. లోతును గ్రహించలేని ముగ్గురు బాలురు టైర్‌ ...

Read More »