Breaking News

మూడవ ర్యాండమయిజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ సిబ్బందికి సంబంధించి 3వ ర్యాండమైజేషన్‌ పూర్తి చేశారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్లో సాధారణ పరిశీలకులు ముషారఫ్‌ ఫరూకి ఆధ్వర్యంలో జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్‌ సిబ్బందిని కేటాయిస్తూ ప్రక్రియ పూర్తి చేశారు. 146 వార్డులకు గాను 621 పోలింగ్‌ స్టేషన్లకు 735 పోలింగ్‌ టీంలను కంప్యూటర్‌ ద్వారా ప్రక్రియ చేశారు.

వారితో పాటు 88 మంది క్రిటికల్‌ సెన్సిటివ్‌ హైపర్‌ సెన్సిటివిటీ మరియు 97 మంది సూక్ష్మ పరిశీలకులను కేటాయించడానికి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *