Breaking News

5.5 లక్షల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ

రెంజల్‌, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా 5.5 లక్షల గొర్రెలు, మేకలకు నట్టాలనివరణ మందులను వేయడం జరిగిందని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీఏ బాలిక్‌ హైమద్‌ అన్నారు. సోమవారం మండలంలోని సాటాపూర్‌, దూపల్లి గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల అందజేత శిబిరంలో పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్‌లు వికార్‌ పాషా, సాయరెడ్డి ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ విడత నట్టల నివారణ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 8 లక్షల 92 వేల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు అందించాల్సి వుందన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల 63 వేల గొర్రెలు, మేకలకు నివారణ మందులు అందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందని తెలిపారు.

నట్టల నివారణ మందులు వేయడం ద్వారా గొర్రెలకు మేకలకు కడుపులో ఉన్న నట్టలు, పురుగులు చనిపోయి బయటకు వస్తాయని అన్నారు. తద్వారా అవి ఆరోగ్యంగా మారి వ్యాధినిరోధక శక్తిని పెంపొందింప చేస్తాయని తెలిపారు. నివారణ మందులు వేయడం ద్వారా గొర్రెలు మేకలకు ఎటువంటి రోగాలు దరిచేరకుండా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి విఠల్‌, జూనియర్‌ వెటర్నరీ అధికారి శశిరేఖా, ఎంపీటీసీ హైమద్‌, పెంపకం దారులు కుర్మె సాయిలు, లింగన్న యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *