Breaking News

ఎన్నికలు పారదర్శకంగా జరగాలి

కామారెడ్డి, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీలోని 49 వార్డులలో బోగస్‌ ఓట్ల విషయమై కామారెడ్డి గుడ్‌ సిటిజన్‌ ఫోరం తరఫున ఈనెల 18న ఆర్‌డివోకు వినతి పత్రం సమర్పించడం జరిగిందని న్యాయవాది రజనికాంత్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియ అయినటువంటి ఎన్నికలు అవినీతి రహితంగా, పారదర్శకంగా, ఓటర్లు సరైన అవగాహనతో తమ ఓటుహక్కు వినియోగించుకొని తద్వారా సాధికారతను సాధించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు.

ఇందులో భాగంగా కామారెడ్డి మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అన్ని వార్డులలో బోగస్‌ ఓట్లు నమోదు విషయంపై ఆర్‌డివోకు వినతి పత్రాన్ని గత రెండు రోజుల క్రితం సమర్పించామని చెప్పారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన ఎన్నికలు ప్రశాంతంగా, ఓటర్లపై ఎటువంటి ఒత్తిడి లేకుండా జరిపించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

చిన్న షెటర్లలో, లాడ్జిల్లో ఉన్న ఇంటి నెంబర్లపై, పూరిగుడిసెల్లో ఉన్న ఇంటినెంబర్లపై, ఇద్దరు కూడా ఉండడానికి అనుకూలంగా లేని ఇళ్ళ నెంబర్లపై సుమారు 15 నుంచి 30 ఓట్లు నమోదైనట్టు ఆధారాలతో సహా సమర్పించి బోగస్‌ ఓట్లకు కారకులైన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. ఈ విషయమై ఆర్‌డివోను గతంలో సంప్రదించగా, బోగస్‌ ఓట్లు వేయడం నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారని రజనికాంత్‌ చెప్పారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *