Breaking News

పల్స్‌ పోలియో కేంద్రాల తనిఖీ

రెంజల్‌, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి సుదర్శన్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు సబ్‌ సెంటర్‌ పల్స్‌ పోలియో కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆస్పత్రిలోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో ఉన్న బాలింతకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కిట్‌ను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 93 శాతం పల్స్‌ పోలియో నమోదైందని పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు పోలియో మహమ్మారిని పారద్రోలేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్లలోపు పిల్లలందరికీ ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

పల్స్‌ పోలియోను వంద శాతం నమోదు చేస్తామన్నారు. పల్స్‌ పోలియో సందర్భంగా వైద్య శాఖ సిబ్బంది ఇంటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తున్నారన్నారు. రెంజల్‌లో స్టాఫ్‌ నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న నవనీత అనారోగ్యం కారణంగా విధులకు హాజరుకాలేకపోవడంతో సిబ్బంది కొరత ఏర్పడిందని వైద్యాధికారిని క్రిస్టినా డిఎంఅండ్‌హెచ్‌వో దష్టికి తెచ్చారు.

స్పందించిన ఆయన నవిపేట్‌ నుండి ఒక స్టాఫ్‌ నర్స్‌ను డిప్యుటేషన్‌పై పంపించడం జరుగుతుందని చెప్పారు. ఆయన వెంట సిబ్బంది గోవర్ధన్‌, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *