Breaking News

జోరుగా ఎన్నికల ప్రచారం

బాన్సువాడ, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ పట్టణంలో తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికల ఇంచార్జీ బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. తెరాస ప్రభుత్వం వచ్చాక బాన్సువాడ పట్టణంలో కనీవినీ ఎరగనంత పెద్దఎత్తున అభివద్ధి జరిగిందన్నారు. భవిష్యత్తులో మరింతగా అభివద్ధి జరగడానికి తెరాస అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *