Breaking News

తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది

కామారెడ్డి, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి బయంతో భారీ యెత్తున ఎలెక్షన్‌ అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. అభివ ద్ది పనులు చేయక, అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి దొంగ వొట్లతో ప్రజలను మోసగించాలని చూస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి ప్రజలను మోసం చేయడానికి కామారెడ్డిలో లేని వారి వోట్లు నమోదు చేసి తద్వారా ఎన్నికల్లో గెలుపొందాలనే పన్నాగం పన్నారన్నారు.

సోమవారం ప్రచారం ముగిసిన అనతరం విలేకరులతో మాట్లాడారు. ఆధారాలతో సహ బోగస్‌ వోటర్ల జాబితా మీడియా ముందుంచారు. 37వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి పాత కష్ణమూర్తి వార్డులో 200 దొంగ ఓట్లను కన్నుక్కొన్నారని, ఆ ఓటర్లందరికి కూడా రెండు ఓటర్‌ గుర్తింపు కార్డులు ఉన్నాయని ఓటరు పేర్లు, వారికి ఉన్న రెండు ఓటర్‌ గుర్తింపు కార్డుల నెంబర్ల తో ఆధారాలను మీడియాకు విడుదల చేశారు.

37వ వార్డులో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి దొంగ ఓట్లను నమోదు చేసిన వాటిని పరిశీలిస్తే, చాలా స్పష్టంగా ఎన్నికల చట్టం ఉల్లంఘన జరిగిందని, ఖచ్చితంగా టిఆర్‌ఎస్‌ అభ్యర్థి అనర్హులుగా ప్రకటిచే అవకాశం ఎంతైనా ఉందన్నారు. సాక్ష్యాలతో కూడిన వినతి పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి, కలెక్టర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.

దోమకొండ, రెడ్డిపేట్‌, జంగంపల్లి, కుప్రియల్‌, గొల్లపల్లి చుట్టూ పక్కల గ్రామాలనుండి పెద్ద యెత్తున దొంగ ఓట్లు నమోదు చేసిన ఆధారాలు పత్రికలకు అందజేసిన వాటిల్లో మార్క్‌ చేసి చూపించారు. వివిధ గ్రామాల ఓటర్‌ కార్డులు వాటిని కలిగి ఉన్న బోగస్‌ ఓటర్ల వివరాలు వెల్లడించారు.

అధికార పార్టీ ఓటమి భయంతో ముందస్తుగా బోగస్‌ ఓట్లను నమోదు చేసి గెలవాలనుకుంటే కామారెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తామనే అపోహలో ఉన్నారని, గెలుపు కోసం టిఆర్‌ఎస్‌ నానా గడ్డి కరుస్తున్నారాని, కానీ కామారెడ్డి నిజమైన అభివద్ది కాంగ్రెస్‌ హయాంలో జరిగిందని షబ్బీర్‌ అలీ స్పష్టం చేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *