Breaking News

Daily Archives: January 21, 2020

ప్రశాంత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 22న బుధవారం మున్సిపల్‌ ఎన్నికల ప్రశాంత పోలింగ్‌ నిమిత్తం పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను జిల్లా కలెక్టరు, జిల్లా సాధారణ పరిశీలకులు సందీప్‌ కుమార్‌, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌ శ్వేత సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ...

Read More »

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం టేక్రియాల 44వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బొలెరో వాహనం బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన తిలిపియా చందుసింగ్‌ (55), తిలీపియా దేకత్కవు (50) సంఘటన స్థలంలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదుచేసి మృత దేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read More »

నట్టల నివారణ మందులు పంపిణీ

రెంజల్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సర్పంచ్‌ రమేష్‌, ఏడి సురేష్‌, పశువైద్యాధికారి విఠల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెలు, మేకలు మురుగు నీరు తాగడం వల్ల గొర్రెలు, మేకలలో నట్టలు ఏర్పడి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, వాటి నివారణకు ఉచిత నట్టల మందుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మండల కేంద్రంలో 5654 మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు ...

Read More »

బేటి బచావో బేటి పడావోపై అవగాహన ర్యాలీ

రెంజల్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడపిల్లలు సమాజానికి మణిహారాలని సర్పంచ్‌ విజయ లింగం అన్నారు. మంగళవారం కూనేపల్లి గ్రామంలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బేటి బచావో బేటి పడావో అవగాహన ర్యాలీలో పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని అన్నారు. స్వేచ్ఛాయుతమైన వాతావరణం, పోషకాహారం అందించి వారి అభివద్ధికి తోడ్పడాలని, ఆడపిల్లను ఉన్నత విద్యను అభ్యసించాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మండలకేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ...

Read More »

ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటింగులో పాల్గొనాలి

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు కలిగిన ప్రతి ఒక్కరు మున్సిపల్‌ ఎన్నికలలో ఓటు వేయాలని, అదేవిధంగా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎన్నికలకు ఏర్పాటుచేసిన రిసెప్షన్‌ సెంటర్‌ను ఆయన మంగళవారం పరిశీలించారు. ఎన్నికల సిబ్బంది హాజర్‌కు సంబంధించి ఆర్‌డిఓను, మున్సిపల్‌ కమిషనర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరగడానికి యంత్రాంగం తరఫున నాలుగు ...

Read More »