Breaking News

ప్రశాంత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

కామారెడ్డి, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 22న బుధవారం మున్సిపల్‌ ఎన్నికల ప్రశాంత పోలింగ్‌ నిమిత్తం పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ తెలిపారు.

మంగళవారం కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను జిల్లా కలెక్టరు, జిల్లా సాధారణ పరిశీలకులు సందీప్‌ కుమార్‌, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌ శ్వేత సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

పోలింగ్‌ రోజున సైకింగ్‌ ఫోర్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ పర్యవేక్షణ వుంటుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మూడు మున్సిపాలిటీలు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలు సంబంధించి కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను 126 పోలింగ్‌ స్టేషన్లు, 41,817 పురుష, 43,326 మహిళా ఓటర్లు కలిపి 85,168 ఓటర్లు వున్నారని అన్నారు.

వారికి అదనంగా మరో 61 ఓటర్లు కలిపి మొత్తం 85,800 ఓటర్లు వున్నారని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులకు గాను, 24 పోలింగ్‌ స్టేషన్లు, 5781 పురుష, 6212 మహిళా ఓటర్లు కలిపి మొత్తం 11,993 ఓటర్లు వున్నారని, వారికి మరో 72 మంది కలిపి మొత్తం 12,065 ఓటర్లు వున్నారని, బాన్సువాడ మున్సిపాలిటీ కి సంబంధించి 19 వార్డులకు గాని 38 పోలింగ్‌ స్టేషన్లు, 1956 పురుష, 10,587 మహిళలు కలిపి 20,543 ఓటర్లుకు అదనంగా మరో 31 ఓటర్లు కలిపి మొత్తం 20,574 ఓటర్లు వున్నారని తెలిపారు.

మొత్తం మూడు మున్సిపాలిటీలకు సంబంధించి 80 వార్డులకు సంబంధించి 188 పోలింగ్‌ స్టేషన్‌ లు, 57,557 పురుష, 60,123 మహిళా ఓటర్లతో మొత్తం 1.17,704 ఓటర్లుకు అదనంగా మరో 744 ఓటర్లు కలిపి మొత్తం 1,18,448 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. రేపు జనవరి 22 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ నడుస్తుందని, జనవరి 25న ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.

ఎన్నికల విధులలో రిజర్వుతో 16 మంది జోనల్‌ అధికారులు, ఎస్‌.ఎస్‌.టి.టీమ్‌ ముగ్గురు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ముగ్గురు. 33 మంది రిటర్నింగ్‌ అధికారులు. 33 సహాయ రిటర్నింగ్‌ అధికారులు, 1135 మంది. ఎన్నికల విధులలో పాల్గొంటున్నారని తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్‌,

రిసెప్షన్‌ సెంటర్లు, స్థానిక వ్యవసాయ మార్కెట్‌ గోదాములో కౌంటింగ్‌ సెంటర్‌, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి మోడల్‌ డిగీ, కాలేజీలో, బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించి ఎస్‌.ఆర్‌.ఎన్‌.కె. ప్రభుత్వ డిగీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మొత్తం 67 కిటికల్‌ పోలింగ్‌ కేందాలలో వెబ్‌ కాస్టింగ్‌, అన్ని పోలింగ్‌ కేంద్రాల వీడియో గ్రఫీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీకి అసిస్టెంట్‌ కలెక్టరు, బాన్సువాడ మునిసిపాలిటి జాయింట్‌ కలెక్టరు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ పుత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటర్లకు వంద శాతం పోలింగ్‌ స్లిప్‌ పంపిణీ చేసినట్లు, ఓఎస్‌డి ఓటర్లకు (ఆబ్సెంట్‌, షిప్టెడ్‌, డెత్‌) సంబంధించి ప్రత్యేక రిజిష్టర్‌లో ఓటరు పేరు నమోదు చేయడం, వేలి ముద్ర, తీసుకోవడం. ఫోటో రికార్డు చేయడం, అదనపు సమాచారం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 24న కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టరు పి.యాదిరెడ్డి, జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టరు తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఆర్డిఓలు రాజేంద్రకుమార్‌, రాజేశ్వర్‌, దేవేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమీషనర్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *