Breaking News

Daily Archives: January 23, 2020

యువత నేతాజీని ఆదర్శంగా తీసుకోవాలి

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌, రెంజల్‌ గ్రామాల్లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 123వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాటాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్‌ వికార్‌ పాషా, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, జనుబాయి, బీజేపీ యువనాయకుడు గోపికష్ణ ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు నోట్‌ పుస్తకాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జయంతి ఉండి వర్ధంతి లేని మహానీయుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఒక్కరేనని దేశ స్వాతంత్రం కోసం అహర్నిశలు కషి చేసి ...

Read More »

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఎంపీపీ రజిని అన్నారు. మండలంలోని వీరన్న గుట్ట పాఠశాలను గురువారం స్థానిక ఎంపీటీసీ లతతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం పాఠశాల ప్రార్ధన సమయానికి ముందే పాఠశాలకు చేరుకున్న ఎంపీపీ రజిని పాఠశాల పనితీరును వాకబు చేశారు. ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియం, ఉర్దూ మీడియం విద్యార్థులు క్రమశిక్షణతో ప్రార్థన నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో 17 మంది ఉపాధ్యాయులు ...

Read More »

కౌంటింగ్‌కు మొబైల్‌ ఫోన్ల అనుమతి లేదు

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బంది కానీ, ఏజెంట్లకు గాని, అభ్యర్థులకు గాని మొబైల్‌ ఫోన్లు అనుమతి లేదని జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులకు తెలిపారు. గురువారం తన ఛాంబర్‌ నుండి సంబంధిత అధికారులతో కౌంటింగ్‌కు సంబంధించి సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ ఏజెంట్లు, సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్‌ సిబ్బంది 25వ తేదీ ఉదయం ఆరు గంటల కల్లా సంబంధిత కౌంటింగ్‌ హాల్‌లకు హాజరుకావాలని ఆయన తెలిపారు. ...

Read More »

బాసరలో భారతమాత మహాహారతి

బాసర, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బాసర గోదావరి నదీ తీరంలో భారతమాత మహాహారతి నిర్వహిస్తున్నట్టు వేదభారతి పీఠం నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి హారతి ఉంటుందన్నారు. కార్యక్రమంలో చతుర్ధశభువనహారతులు, భారతమాతహారతి, త్రివర్ణపతాకహారతి, చతుర్వేదహారతి, గోప్రకతిహారతి, మహనీయులహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, పుష్పహారతి, నాగహారతి, గుగ్గిలధూపహారతి యివ్వబడుతుందన్నారు. కావున భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని భారతమాత, గంగామాత అనుగ్రహం పొందగలరని పేర్కొన్నారు.

Read More »

బోధన్‌లో రీపోలింగ్‌

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 32 వ వార్డులో గల 87వ పోలింగ్‌ స్టేషన్లో టెండర్‌ ఓటు నమోదు అయినందుకు గాను అక్కడి పోలింగ్‌ రద్దు చేసి తిరిగి 24వ తేదీన రీపోలింగ్‌ నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశోక్‌ కుమార్‌ నోటిఫిన్‌ జారీ చేశారు. ఈ నెల 22న బోధన్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో నసేహా సుల్తానా అనే మహిళ ఓటర్‌ స్లిప్‌ చూపించి ఓటు వేయడానికి రాగా పోలింగ్‌ ఏజెంట్లు ...

Read More »

కౌంటింగ్‌ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓట్ల లెక్కింపు కొరకు ఎంపిక చేసిన పాలిటెక్నిక్‌ కళాశాలలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలో 60 డివిజన్‌లు ఉండగా 30 డివిజన్లకు రెండు కౌంటింగ్‌ హాళ్లను ఒక భవనంలోనూ వెనుక భాగంలో మరో ముప్పై డివిజన్లకు 3 కౌంటింగ్‌ హాల్‌లను వెనుక భాగంలో లెక్కించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు వెళ్లడానికి అదేవిధంగా కౌంటింగ్‌ సిబ్బంది వెళ్లడానికి వేరువేరుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ...

Read More »

25న బహుజన వామపక్ష ఫ్రంట్‌ ఆవిర్భావ సభ

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 25న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న బహుజన వామపక్ష ఫ్రంట్‌ రెండవ ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్లను గురువారం నిజామాబాదులో ఫ్రంట్‌ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు దండి వెంకట్‌ మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. శాస్త్రీయమైన మహోన్నత శ్రామిక బహుజన సైద్ధాంతిక సిద్ధాంతమే ఫూలే-అంబేద్కర్‌ మార్క్సిస్టు ఆలోచన విధానమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు 93 ...

Read More »

ఘనంగా నేతాజీ జయంతి

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి రాజాగౌడ్‌ నిజామాబాద్‌ సుభాష్‌ నగర్‌లోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం పోరాడిన నేత నేతాజీ అని ఈ సందర్భంగా రాజాగౌడ్‌ కొనియాడారు. ఆయన వెంట పలువురు కార్యకర్తలున్నారు.

Read More »

భారతీయులందరూ ఒకటే

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుభాష్‌ చంద్ర బోస్‌ జయంతి సందర్భంగా ఎన్నార్సీ, సిఎఎ, ఎంపీఆర్‌లకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిజామాబాదు సుభాష్‌ నగర్‌ లోని నేతాజి విగ్రహానికి నివాళులు అర్పించి రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వనమాల కష్ణ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమ పితామహుడు నేతాజీ భారతీయులందరూ ఒకటేనని పిలుపునిచ్చారన్నారు. అందులో భాగంగా కుల, మత ప్రాంతీయ విద్వేషాలకు అతీతంగా, భారతీయులలో ఐక్యత సాధించడానికి విరోధంగా ...

Read More »

తెలంగాణ యూనివర్సిటీ క్యాలెండర్‌ ఆవిష్కరణ

డిచ్‌పల్లి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ముద్రించిన 2020 నూతన సంవత్సర క్యాలెండర్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి నీతూ ప్రసాద్‌ ఆవిష్కరించారు. గురువారం హైదరాబాదులో జరిగిన క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ పబ్లికేషన్‌ సెల్‌ కో – ఆర్డినేటర్‌ డా. ఎం. సత్యనారాయణ, క్యాలెండర్‌ కమిటీ సభ్యులు డా. కె. రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Read More »

అయ్యప్ప స్వామికి 25 తులాల వెండి కిరీటం

బాన్సువాడ, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామి వారికి కిరీటం నిమిత్తం బాన్సువాడ పట్టణానికి చెందిన కొత్త నారాయణ దంపతులు 25 తులాల వెండిని అయ్యప్ప సేవా సమితికి అందజేశారు. గురువారం ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి ప్రతినిధి గురువినయ్‌ కుమార్‌, ఆలయ కోశాధికారి ధనగారి కష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

నిజామాబాద్‌లో మాజీ సైనిక ఉద్యోగుల ర్యాలీ

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మారుతి నగర్‌ శ్రీ రామ గార్డెన్స్‌ హాల్‌లో ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 8 గంటల నుండి దక్షిణ భారత్‌ ఏరియా మరియు తెలంగాణ, ఆంధ్ర సబ్‌ ఏరియా ఆధ్వర్యంలో ఆర్టిలరీ సెంటర్‌ హైదరాబాద్‌ చేత మాజీ సైనిక ఉద్యోగుల ర్యాలీని నిర్వహించనున్నట్టు డిఫెన్స్‌వింగ్‌ పత్రికా సమాచార కార్యాలయం వారు ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌ మరియు నిర్మల్‌ జిల్లాలకు సంభందించిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాలకు ...

Read More »