Breaking News

Daily Archives: January 25, 2020

ఒక్క ఓటే గెలుపు తీర్పు చెప్పింది

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ఒక్క ఓటు విలువ కూడా ఎంతో విలువైనదని చాలా సందర్బాలో విన్నాం, చూశాం. అది కళ్లముందు మరోసారి ప్రత్యక్షమైన రోజు శనివారం వచ్చింది. కామారెడ్డి మునిసిపల్‌ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో బిజెపి అభ్యర్థి పండ్ల ప్రవీణ్‌ మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మసూద్‌ అలీని ఓడించి ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. మునిసిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఓడిపోవడం, అదీ ఒక్క ఓటు తేడాతో పరాజయాన్ని చవిచూడడం కామారెడ్డిలో టాక్‌ ఆఫ్‌ ది ...

Read More »

మిషన్‌ గులాబి షురూ

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ మిషన్‌ ఆకర్ష్‌ గులాబికి తెరలేపారు. స్వతంత్ర అభ్యర్తులుగా గెలుపొందిన వారిని మిషన్‌ ఆకర్ష్‌తో పార్టీలోకి చేర్చుకున్నారు. ఎన్నికల తంతు ముగిసిన శనివారం తొలిరోజునే నలుగురిని పార్టీ కండువా కప్పి శిబిరంలో చేర్చుకోగా మరో ఇద్దరిని సైతం ఈరాత్రికే పార్టీలోకి ఆకర్షిస్తున్నట్టు సమాచారం. ఛైర్మన్‌ ఎన్నిక వరకు అందరిని శిబిరానికి తరలించనున్నట్టు తెలుస్తోంది.

Read More »

కామారెడ్డి మునిసిపాలిటీ తెరాస కైవసం

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మునిసిపల్‌ ఎన్నికల్లో తెరాస పార్టీ విజయ దుందుభి మోగించింది. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు ఎవరి నియోజకవర్గ పరిధిలో వారి మునిసిపాలిటీల్లో తెరాస జెండా ఎగురవేయాలని లేని పక్షంలో దాని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇదివరకే హెచ్చరికలు జారీచేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నారు. ఆ పార్టీ మొత్తం 49 స్థానాలకు గాను 29 స్థానాల్లో ...

Read More »

నిజామాబాద్‌ కార్పొరేటర్లు వీరే

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి… 1వ డివిజన్‌ – కె.లలిత (తెరాస), 2వ డివిజన్‌ – ఆర్‌.మలావత్‌ (తెరాస), 3వ డివిజన్‌ – శ్రీనివాస్‌రెడ్డి (తెరాస), 5వ డివిజన్‌ – ఎస్‌.సౌజన్య (బిజెపి), 6వ డివిజన్‌ – ఉమారాణి (బిజెపి), 7వ డివిజన్‌ – ఎస్‌.మదు (బిజెపి), 8వ డివిజన్‌ – విక్రమ్‌గౌడ్‌ (బిజెపి), 10వ డివిజన్‌ – బి. కోమల్‌ (తెరాస), 11వ ...

Read More »

ఓటు వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు తమ ఓటు నమోదు చేసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగం ప్రజల చేత ప్రజల కొరకు. ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని ఏర్పాటు ...

Read More »

ఫోర్‌వీలర్‌ డ్రైవింగ్‌ ఉచిత శిక్షణ

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బి.సి స్టడీ సర్కిల్‌ ఆద్వర్యంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన బి.సి. యువకులకు ఫోర్‌ వీలర్‌ డ్రైవింగ్‌కు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బిసి స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ సి.హెచ్‌.వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుండి 25 మందిని ఈనెల 28వ తేదీన ఉదయం 10 గంటలకు బిసి స్టడీ సర్కిల్‌లో లక్కి డ్రా ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కావున శిక్షణకు దరఖాస్తు చేసుకున్న ...

Read More »