Breaking News

Daily Archives: January 26, 2020

ఆహ్లాదకరంగా ఎట్‌ హోమ్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎట్‌ హోమ్‌ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఆహ్లాదకరంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, శిక్షణ ఐపీఎస్‌ అధికారి, జిల్లా అటవీ అధికారి సునీల్‌, సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, డిటిసి వెంకటరమణ, ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్న కార్యక్రమంలో బాల భవన్‌ పిల్లల సాంస్కతిక కార్యక్రమాలు, మెజీషియన్‌ రంగనాథ్‌ ...

Read More »

పల్లెప్రగతికి పూర్వవిద్యార్ధుల విరాళం

రెంజల్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తాడ్‌ బిలోలికి చెందిన పూర్వ విద్యార్థులు రూ. 10 వేలు విరాళం అందజేశారు. స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదువుకున్న 2006-07 పదవ తరగతి బ్యాచ్‌ విద్యార్థులు కలిసి పదివేల రూపాయలు అందజేశారు. పల్లె ప్రగతికి పూర్వ విద్యార్థులు విరాళం అందజేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌ సునీత నర్సయ్య ఆధ్వర్యంలో దాతలను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెల్మల సునీత నర్సయ్య, ఉపసర్పంచ్‌ ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యాల్‌కల్‌ రోడ్‌ లోని మానసిక వికలాంగుల పాఠశాలలో క్లబ్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్‌ జాతీయ జెండా ఎగురవేశారు. విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి చింతల గంగాదాస్‌, పూర్వాద్యక్షులు పి.లక్ష్మినారాయణ, ప్రోగ్రామ్‌ చైర్మెన్‌ పొలాస సత్యనారాయణ, పాఠశాల కరస్పాండెంట్‌ రమేష్‌ పాల్గొన్నారు.

Read More »

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి పాఠశాలలకు చెందిన విద్యార్థులు వాడవాడలా ర్యాలీలు నిర్వహించి పలు ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ జెండాను ఎగరవేశారు. తహసిల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో గోపాలకష్ణ, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ శంకర్‌ జెండా ఎగరవేశారు. వివిధ గ్రామాల్లో ఆయా పార్టీలకు చెందిన నాయకులు పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ ...

Read More »