Breaking News

ఆహ్లాదకరంగా ఎట్‌ హోమ్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, జనవరి 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎట్‌ హోమ్‌ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఆహ్లాదకరంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, శిక్షణ ఐపీఎస్‌ అధికారి, జిల్లా అటవీ అధికారి సునీల్‌, సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, డిటిసి వెంకటరమణ, ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్న కార్యక్రమంలో బాల భవన్‌ పిల్లల సాంస్కతిక కార్యక్రమాలు, మెజీషియన్‌ రంగనాథ్‌ మాయలు, రాబర్ట్‌ మాట్లాడే బొమ్మ తదితర కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సోమవారంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావస్తున్నందున జిల్లా యంత్రాంగం ఇక ప్రభుత్వ పథకాలు తదితర కార్యక్రమాలపై దష్టి కేంద్రీకరించనుందని తెలిపారు. ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మంచి టీం వర్క్‌తో పని చేస్తున్న అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు.

ఇప్పటివరకు అధికారులకు అప్పగించిన అన్ని పనులు కూడా పొరపాట్లకు అవకాశం లేకుండా పూర్తి చేశారని, పల్లె ప్రగతి 2, మున్సిపల్‌ ఎన్నికలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. పోలీస్‌ కమిషనర్‌ ఎంతో బ్యాలెన్స్‌గా అన్నింటిని సరి చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అదేవిధంగా సంయుక్త కలెక్టర్‌ ప్రశాంతత, జిల్లా రెవెన్యూ అధికారి అనుభవం బాగా ఉపయోగపడుతున్నాయని, అదేవిధంగా పల్లె ప్రగతిలో డంపింగ్‌ యార్డ్‌లకు, స్మశాన వాటికలకు స్థలాలు కేటాయించడానికి అటవీశాఖ అధికారి మంచి సహకారం అందించారన్నారు.

రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి సేవలందించడానికి అందరితో కలిసి ముందుకు వెళ్లాలని ఉన్నామని, జీతంతో కూడిన ఉద్యోగం తద్వారా ప్రజలకు సేవచేసే అదష్టం కలవడం దేవుడిచ్చిన వరమని దీనిని త్రికరణశుద్ధిగా ప్రతి అధికారి, ఉద్యోగి అంకితభావంతో పని చేస్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయన్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులు తమ్మి సరస్వతి, కావేటి లక్ష్మీ నరసమ్మ, కే.లింగు బాయ్‌లను కలెక్టర్‌ సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను జ్ఞాపికలతో సన్మానించారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *