Breaking News

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి పాఠశాలలకు చెందిన విద్యార్థులు వాడవాడలా ర్యాలీలు నిర్వహించి పలు ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ జెండాను ఎగరవేశారు.

తహసిల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో గోపాలకష్ణ, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ శంకర్‌ జెండా ఎగరవేశారు. వివిధ గ్రామాల్లో ఆయా పార్టీలకు చెందిన నాయకులు పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. తాడ్‌బిలోలి ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన నత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *