Breaking News

Daily Archives: January 27, 2020

మీ వెనకాల నేనుంటా

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే సరిచేయడానికి మీ వెనకాల నేను ఉంటానని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అధికారులను ప్రోత్సహించారు. సోమవారం సాయంత్రం జిల్లా అధికారుల కన్వర్జెన్స్‌ మీటింగ్‌ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికలలో అన్ని విధాలా అధికారులను ప్రోత్సహిస్తూ ప్రశాంతంగా నిర్వహించడానికి వెనక ఉండి నడిపించిన కలెక్టర్‌ను మున్సిపల్‌ కమిషనర్‌ అధికారుల సమక్షంలో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎవరు ...

Read More »

పల్లె ప్రగతికి అత్యంత ప్రాముఖ్యం

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ్యం, పచ్చదనానికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమన్వయ సమావేశం వలన శాఖ అధికారుల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఉపయోగపడతాయని, అందుకని తప్పనిసరిగా జిల్లా అధికారులు సోమవారం ఉదయం ప్రజావాణికి, సాయంత్రం కన్వర్జెన్స్‌ ...

Read More »

బేటి బచావో బేటి పడావోపై అవగాహన

రెంజల్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో సోమవారం ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల రాణి ఆధ్వర్యంలో విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించి వారి అభివద్ధికి తోడ్పడాలని అన్నారు. ప్రభుత్వం ఆడపిల్లల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న తీరును ఆమె గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వివరించారు. సమాజంలో ఆడపిల్లలను రక్షించి వారి బంగారు భవితకు పునాదులు వేయాలన్నారు. గర్భిణీ స్త్రీలు బాలింతలకు అంగన్‌వాడి ...

Read More »

జాహ్నవి అను నేను ….

కామారెడ్డి, జనవరి 27 కామారెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌గా నిట్టు జాహ్నవి నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌గా నిట్టు జాహ్నవి ఎంపికయ్యారు. 25 ఏళ్ల యువ రాజకీయ నాయకురాలిగా కామారెడ్డి రాజకీయ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మహిళ, కామారెడ్డి మునిసిపల్‌ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సష్టించారు. ఇంతకీ ఎవరీ జాహ్నవి? కామారెడ్డి రాజకీయ వేత్త, తెరాస పార్టీలో సీనియర్‌ నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ నిట్టు వేణు గోపాల్‌ రావు కూతురు. ఎం.ఎ, బీఈడీ పూర్తి చేసి, లా కాలేజీలో ...

Read More »

31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తన ఛాంబర్‌లో సోమవారం 31వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలకు సంబంధించిన పాంప్లెట్స్‌, బ్రోచర్స్‌, స్లొగన్స్‌ విడుదల చేశారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ కె. వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

ప్రశాంతంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు మేయర్‌గా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన దండు నీతు కిరణ్‌, డిప్యూటీ మేయర్‌గా ఏఐఎంఐఎం పార్టీకి చెందిన మొహమ్మద్‌ ఇద్రీస్‌ ఖాన్‌ ఎంపికయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవడానికి స్థానిక కొత్త అంబేద్కర్‌ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, అదనపు డిసిపి ఉషా విశ్వనాథ్‌ పరిశీలనలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ...

Read More »

వీరన్నగుట్టలో పెద్డపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన

రెంజల్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో పెద్ద పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. దేవతమూర్తుల విగ్రహాలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అంగరంగ వైభవంగా ప్రతిష్ఠాపన నిర్వహించారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞం నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ఆలయం వద్దకు భారీగా తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రజినీ, సర్పంచ్‌ బైండ్ల రాజు, ఎంపీటీసీ లత, మాజీ ఎంపీటీసీ కిషోర్‌, ఆలయకమిటి ...

Read More »

మంగళవారం మండల సర్వసభ్యసమావేశం

రెంజల్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రెంజల్‌ మండల ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్‌ అధ్యక్షురాలు రజినీ అధ్యక్షతన ఏర్పాటు చేయనున్నామని రెంజల్‌ ఎంపీడీవో గోపాలకష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని సూచించారు.

Read More »