Breaking News

పాఠశాల అభివద్ధికి పూర్వ విద్యార్థి చేయూత

రెంజల్‌, జనవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల అభివద్ధికి చేయుత అందించేందుకు పూర్వవిద్యార్ధులు బాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి రెండవ విడతలో జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాల అభివద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు వస్తున్నారు.

మండలంలోని దూపల్లి గ్రామ నివాసి పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి రఘుపతి లక్ష్మణ్‌ పాఠశాల బెంచీలు (బల్లలు) కొనుగోలుకు రూ. 20 వేల నగదును మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యయడు దేవదాస్‌, పాఠశాల ఛైర్మన్‌ బక్కయ్యకు అందచేశారు. కార్యక్రమంలో పిఆర్‌టియు మండల కార్యదర్శి సాయరెడ్డి, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Comment on the article