Breaking News

క్రీడల వల్ల ఉల్లాసం

నిజామాబాద్‌, జనవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిరోజు పనుల్లో నిమగ్నమయ్యే ఉద్యోగులకు క్రీడల వల్ల ఉత్సాహం ఏర్పడుతుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు అన్నారు. మంగళవారం పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా 33వ జిల్లాస్థాయి క్రీడలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ కాబట్టి రోజువారీగా బిజీగా ఉండే మీరు శాఖల వారీగా పనిలో నిమగ్నమై ఉంటారు కాబట్టి ఉల్లాసం, ఆనందం కొరకు క్రీడలను జరుపుకోవడం ఎంతైనా అవసరమని తెలిపారు. ఆటలను ఫ్రెండ్లీ మ్యాచ్‌గా చూడాలని ఓడినా గెలిచినా ఫ్రెండ్లీగా ఉండాలని కోరారు.

జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే విషయంలో ముందుండాలని, ప్రభుత్వానికి – ప్రజలకు మనం వారధిగా పని చేయాలని, పని చేసే క్రమంలో ఆరోగ్యం కూడా ముఖ్యమని, ఆరోగ్యం బాగుంటే 8 నుండి 10 గంటలు పని చేసే అవకాశముంటుందన్నారు.

అందులో భాగంగా స్పోర్ట్స్‌ మీట్‌ ఉద్యోగులకు అవసరమని ఉమ్మడి జిల్లా క్రీడా పోటీల్లో ఒకరికొకరు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశమేర్పడుతుందని తెలిపారు. క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉంటుందన్నారు.

కార్యక్రమంలో డిఆర్వో అంజయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, సిఇఓ జెడ్‌పి గోవింద్‌, డిఆర్‌డివో రమేష్‌, సహాయ సంచాలకులు, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ కిషన్‌ రావు, కళాశాల ప్రిన్సిపాల్‌ ఒలంపిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిజామాబాద్‌ టీఎన్‌జిఓ అధ్యక్షులు అలక కిషన్‌, సెక్రెటరీ అమత్‌, కామారెడ్డి టిఎన్‌జిఓ అధ్యక్షులు, సెక్రటరీ వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సొంతింటి (కల) గానే మిగిలిపోయింది…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ఆశపెట్టి ...

Comment on the article