పల్లె ప్రగతి పనులు వందశాతం పూర్తి చేయాలి

రెంజల్‌, జనవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై నెలాఖరులోగా వంద శాతం పనులను పూర్తి చేయాలని ఎంపీపీ రజిని మండల ప్రత్యేక అధికారి విజయ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ లోలపు రజినీ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా సాగింది. ప్రధాన శాఖల అంశాలను పరిగణనలోకి తీసుకుని మిగతా శాఖలను కొనసాగించకుండానే సమావేశం ముగించారు.

వ్యవసాయ శాఖ, వైద్య శాఖ, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ శాఖల అధికారుల పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే అధికారులు కార్యాలయాలకే పరిమితమవ్వడంతో గ్రామాల్లో పాలన కుంటుపడుతుందని సభ్యులు అధికారులను నిలదీశారు. గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ప్రభుత్వ పనుల అనుమతి పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అడ్డుకుని ప్రభుత్వం పనులకే వినియోగించేలా కట్టడిచేయాలని సభ్యులు సభ దష్టికి తీసుకువచ్చారు. ఉదయం వేళల్లో అక్రమంగా ఊకను తరలిస్తుండడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, పలుమార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వైఎస్‌ ఎంపీపీ యోగేష్‌ అన్నారు.

వైద్యసేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి వేళల్లో కూడా ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఎంపీపీ రజినీ అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేక విజయ, వైఎస్‌ ఎంపిపి యోగేష్‌, తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌, ఎంపిడివో గోపాలకష్ణ, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *