Breaking News

కెటిఆర్‌ను కలిసిన మేయర్‌

నిజామాబాద్‌, జనవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నికైన దండు నీతూ కిరణ్‌ మంగళవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నీతు కిరణ్‌ను కెటిఆర్‌ అభినందించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్త, జీవన్‌ రెడ్డి, జాజిరెడ్డి గోవర్దన్‌తో పాటు మేయర్‌ భర్త దండు శేఖర్‌ కూడా కెటిఅర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Check Also

ఆ రెండు క‌ల్లు దుకాణాల‌తో కష్టాలు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర ప్రజల‌కు అసౌకర్యం కలిగిస్తున్న క‌ల్లు దుకాణం ఇక్కడి ...

Comment on the article