Breaking News

Daily Archives: January 29, 2020

ఓటు ద్వారానే రాజ్యాంగం బలోపేతం

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్య దేశాల్లో మన భారతదేశం ఎంతో అడ్వాన్స్‌గా ఉందని అది ఓటు ద్వారానే సాధ్యమవుతున్నదని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఎలక్టోరలల్‌ లిటరసీ క్లబ్‌ నోడల్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజల చేత ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి మన రాజ్యాంగం తయారు చేసుకోవడం జరిగిందని, దీనికి ప్రపంచంలోనే ఎంతో గౌరవం ఉందన్నారు. దీనికి కారణం ...

Read More »

జాతీయ నిరుద్యోగ రిజిస్టర్‌ కాంపెయిన్‌

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ యువజన కాంగ్రెస్‌ అధ్వర్యంలో జాతీయ నిరుద్యోగ రిజిస్టర్‌ను నిర్వహించేందుకు మిస్డ్‌ కాల్‌ కాంపెయిన్‌ను బుదవారం నిజామాబాద్‌లో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి బొబ్బిలి రామకష్ణ ప్రారంభించారు. పట్టభద్రులైన నిరుద్యోగ యువత 8151994411 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని రామక్రిష్ణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రూరల్‌ యువజన కాంగ్రెస్‌ నాయకులు మోత్కురి నవీన్‌ గౌడ్‌, దేవేందర్‌, నవనీష్‌, నవీన్‌, విజయ్‌, మహేందర్‌, మనోజ్‌ ఉదయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కాలోజీవాడి గ్రామానికి చెందిన పైడి జగన్‌ రెడ్డి (59) తొమ్మిది నెలల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ దేశానికి గొర్ల కాపరిగా వెళ్లాడు. గత 17 రోజుల క్రితం విధినిర్వహణలో అక్కడే గుండె పోటుతో మతి చెందాడు. విషయం తెలుసుకొని మతుడు పైడి జగన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను గల్ఫ్‌ వెల్పేర్‌ అండ్‌ కల్చరల్‌ అద్యక్షుడు పాట్కూరి బసంత్‌ రెడ్డి, ఓర్ల శ్రీనివాస్‌ రెడ్డి మతుని కుటుంబాన్ని ...

Read More »

ట్రాక్టర్లు కొనుగోలు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, పంచాయతీరాజ్‌ అధికారులు, మండలాల ఎంపీఓలతో పల్లె ప్రగతి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు సేకరించడం అత్యంత ప్రధానమైన విషయమని ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా ఉన్నారన్నారు. ప్రతి గ్రామపంచాయతీ తప్పనిసరిగా ట్రాక్టర్‌ ...

Read More »

బిఎల్‌ఎఫ్‌లో చేరిన సిపిఎం నాయకులు

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్‌ బిఎల్‌ఎఫ్‌ పార్టీలో చేరారు. నిజామాబాద్‌ నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గహంలో బుదవారం జరిగిన కార్యక్రమంలో బహుజన లెఫ్ట్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దండి వెంకట్‌ ఆధ్వర్యంలో గంగాధర్‌ బిఎల్‌ఎఫ్‌లో చేరారు. బిఎల్‌ఎఫ్‌ జిల్లా అద్యక్షులు ముత్యాల శ్యామ్‌ బాబు బహుజన లెఫ్ట్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అద్యక్షులు ఆర్టీసీ సంజీవ్‌, నగర అద్యక్షులు కొటారి రాములు పాల్గొన్నారు.

Read More »

ప్రతిభా పరీక్ష విజయవంతం చేయండి

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమైక్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రతిభా పరీక్షను ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 2న ఆదివారం ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు పదవ తరగతి చదువుతున్న ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులు వారి యొక్క పేర్లను క్రింద తెలుపబడిన నంబర్లకు నమోదు ...

Read More »

హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న లచ్చా గౌడ్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Read More »

ఆదర్శ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

రెంజల్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి 2020-21 గాను ప్రవేశాలకు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ బలరాం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతికి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఏప్రిల్‌ 9 నుంచి ...

Read More »

ముదిరాజ్‌ సంఘం భవనానికి భూమి పూజ

రెంజల్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో బుధవారం సర్పంచ్‌ వికార్‌ పాషా ముదిరాజ్‌ సంఘం నూతన భవనానికి భూమిపూజ చేశారు. సిడిపి నిధుల ద్వారా ఐదు లక్షల రూపాయల వ్యయంతో ముదిరాజ్‌ సంఘం భవనం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ముదిరాజుల భవనం కోసం సిడిపి నిధులను ఐదు లక్షలు అందించిన ఎమ్మెల్యే మహమ్మద్‌ షకీల్‌ అమీర్‌కు ముదిరాజ్‌ సంఘం సభ్యులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ హైమద్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు కుర్మె సాయిలు, ముదిరాజ్‌ ...

Read More »

చిన్నతనం నుంచే సేవా భావాన్ని అలవరచాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు ఉద్బోదించారు. నిజామాబాదు నగరంలోని టీఎన్‌జివో భవన్‌లో మంగళవారం రాత్రి జేసిఐ ఇందూర్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కార్యక్రమానికి విఠల్‌ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తోడు జేసిఐ లాంటి స్వచ్చంద సంస్థలు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. పిల్లలకు ...

Read More »

జిల్లా కార్యాలయాలు దిక్సూచిగా పని చేయాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు కిందిస్థాయి కార్యాలయాలకు దిక్సూచిగా పనిచేసి ప్రజల సేవలు వేగవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ప్రగతి భవన్‌, కలెక్టరేట్‌, అక్షర ప్రణాళిక భవన్‌, వెల్నెస్‌ సెంటర్‌, శిక్షణ కేంద్రంలోని కార్యాలయాలను ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు, సెలవుపై వెళితే వారి సెలవు పత్రాలను పరిశీలించారు. చాలా కార్యాలయాలలో హాజరీ విషయంలో ఆయన అసంతప్తి వ్యక్తం ...

Read More »

అధరములు విడివడు హాసమునందున

అ మె రి కా పాదాదిగ ఆ.వె. అధరములు విడివడు హాసమునందున మెరుపు లీనెడి పలు వరుసలను వి రిసిన కుసుమమె మది రీతిని గనినను కాంత యందమునకు కారణమిది. (2)తే.గీ. అంజలి ఘటించి వేడగ నాదుకొనగ మెరుపు వేగమ్మునేతెంచి కరుణ తోడ రిపుల జంపి పాపాల హరింప జేసి కాచు చుండు నెపుడు రమ కాంతుడిలను. (3)ఆ.వె. అవని పైన మనుజుడారాట పడుచుండు మెతుకు కొరకె గాక మెప్పు కొరకు రిక్త హస్తుడిగను ముక్తి నొందు గడకున్ కామితవలయంపు కడలి నీది . ...

Read More »