Breaking News

జిల్లా కార్యాలయాలు దిక్సూచిగా పని చేయాలి

నిజామాబాద్‌, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు కిందిస్థాయి కార్యాలయాలకు దిక్సూచిగా పనిచేసి ప్రజల సేవలు వేగవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ప్రగతి భవన్‌, కలెక్టరేట్‌, అక్షర ప్రణాళిక భవన్‌, వెల్నెస్‌ సెంటర్‌, శిక్షణ కేంద్రంలోని కార్యాలయాలను ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు, సెలవుపై వెళితే వారి సెలవు పత్రాలను పరిశీలించారు.

చాలా కార్యాలయాలలో హాజరీ విషయంలో ఆయన అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కార్యాలయాలు- డివిజన్‌, మండలాలు, గ్రామస్థాయిలో పనిచేసే కార్యాలయాలకు మార్గదర్శిగా ఉంటూ ఎప్పటికప్పుడు అన్ని కార్యక్రమాలపై పర్యవేక్షణ చేస్తూ వారికి అవసరమైన సూచనలు చేస్తూ ఉండాలన్నారు. కార్యాలయాల్లో పనులకు నిబంధనలు పాటించేలా పరిశీలన చేస్తూ మంజూరుకి సంబంధించిన పద్ధతులను, నియమ నిబంధనలను వారికి సూచిస్తు ఉండాలన్నారు.

అదేవిధంగా పనులన్నీ వేగవంతంగా జరిగేలా, ఫైల్స్‌ పెండింగ్‌ లేకుండా చూడవలసిన బాధ్యత కూడా జిల్లాస్థాయి కార్యాలయాలు, అధికారులపై ఉందన్నారు. రెగ్యులర్‌గా పరిశీలన, పర్యవేక్షణ ద్వారా పనులు వెంటవెంటనే పూర్తి చేయడానికి వీలవుతుందని, క్షేత్ర స్థాయి అధికారులపై అజమాయిషీ వల్ల ఇది అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఎక్కడైనా పనులలో వేగం తగ్గితే చర్యలు తీసుకోవడానికి కూడా వీలవుతుందన్నారు.

సంక్షేమ శాఖల వసతి గహాలలో ఎంతోమంది పేద పిల్లలు ఉండి చదువుకుంటున్నారని వారికి ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలను, నాణ్యమైన విద్యను అందించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో తనిఖీ చేసిన కలెక్టర్‌ సిబ్బందితో మాట్లాడుతూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, టూరు ఉంటే అక్కడ ఏం పని చేశారో అధికారులు పర్యవేక్షణ చేయాలని తప్పకుండా క్షేత్రస్థాయిలో పనులు జరగాలని, ఇది ప్రజల కోసం పని చేస్తున్న చాలా పెద్ద శాఖని, పద్ధతి ప్రకారం రోజువారీ కార్యక్రమాలు జరగాలన్నారు.

బయోమెట్రిక్‌ హాజరీని రెగ్యులర్‌గా పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పర్యటించిన ఆయన కార్యాలయ ఆవరణలో కొనసాగుతున్న పిచ్చి మొక్కల తొలగింపు, క్లీన్లీనెస్‌ తదితర కార్యక్రమాలపై సంతప్తి వ్యక్తం చేస్తూ ఇన్ని సంవత్సరాలకు డిఈఓ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు.

వయోజన విద్య ఏ.పీ.ఓ. సస్పెన్షన్‌కు ఆదేశం

వయోజన విద్య శాఖ కార్యాలయంలో ఏ.పీ.ఓ.గా పని చేస్తున్న అరుంధతి ఈనెల 7వ తేదీ నుండి అనధికారిక గైర్హాజరుతో పాటు ఎటువంటి సమాచారం లేకుండా కార్యాలయానికి రావడంలేదని గుర్తించిన కలెక్టర్‌ ఆమెను సస్పెండ్‌ చేయవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా మంగళవారం కోటగిరిలోని వెనుకబడిన తరగతుల వసతి గహంలో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా బిసి అభివద్ధి అధికారి శంకర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం, డీఈవో జనార్దన్‌ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *