Breaking News

చిన్నతనం నుంచే సేవా భావాన్ని అలవరచాలి

నిజామాబాద్‌, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు ఉద్బోదించారు. నిజామాబాదు నగరంలోని టీఎన్‌జివో భవన్‌లో మంగళవారం రాత్రి జేసిఐ ఇందూర్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కార్యక్రమానికి విఠల్‌ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తోడు జేసిఐ లాంటి స్వచ్చంద సంస్థలు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు సంస్కారంతో పాటు చిన్నతనం నుండే సేవా భావాన్ని అలవర్చాలని సూచించారు. తాను కూడా నేతాజి యూత్‌ ఆద్వర్యంలో గతంలో సేవా కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు.

జేసిఐ ఇందూర్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తిరునగరి శ్రీహరి చేత జేసీస్‌ జోన్‌ అధ్యక్షుడు నల్ల సంతోష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జేసిఐ జోన్‌ ఉపాద్యక్షులు దడిగెల రమేష్‌, ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్రప్రసాద్‌, పూర్వ జోన్‌ అధికారి జిల్కర్‌ విజయానంద్‌ ,మహిళా విభాగం అధ్యక్షురాలు కోడూరు పద్మ, జూనియర్‌ విభాగం అధ్యక్షురాలు కోడూరు సంకీర్తన, జేసిఐ ఇందూర్‌ పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్‌, బంగారి వీరబ్రహ్మం, దండు గోవర్దన్‌, శ్రీనివాస్‌ రెడ్డి, రమణ గౌడ్‌, జిల్కర్‌ లావణ్య, కార్యదర్శి హన్మాండ్లు, కోశాధికారి డాక్టర్‌ జె.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *