Breaking News

అధరములు విడివడు హాసమునందున


మె
రి
కా
పాదాదిగ
ఆ.వె.

అధరములు విడివడు హాసమునందున

మెరుపు లీనెడి పలు వరుసలను వి

రిసిన కుసుమమె మది రీతిని గనినను

కాంత యందమునకు కారణమిది.

(2)తే.గీ.

అంజలి ఘటించి వేడగ నాదుకొనగ

మెరుపు వేగమ్మునేతెంచి కరుణ తోడ

రిపుల జంపి పాపాల హరింప జేసి

కాచు చుండు నెపుడు రమ కాంతుడిలను.

(3)ఆ.వె.

అవని పైన మనుజుడారాట పడుచుండు

మెతుకు కొరకె గాక మెప్పు కొరకు

రిక్త హస్తుడిగను ముక్తి నొందు గడకున్

కామితవలయంపు కడలి నీది .

**తిరునగరి గిరిజా గాయత్రి

The following two tabs change content below.

Girija Gayatri

తిరునగరి గిరిజా గాయత్రీ

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *