Breaking News

ఆదర్శ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

రెంజల్‌, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి 2020-21 గాను ప్రవేశాలకు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ బలరాం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతికి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.

ఏప్రిల్‌ 9 నుంచి 12 వరకు హాల్‌ టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని, ఏప్రిల్‌ 12 న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని దరఖాస్తులను దగ్గరలోని మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్‌ బలరాం తెలిపారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *