ఓటు ద్వారానే రాజ్యాంగం బలోపేతం

నిజామాబాద్‌, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్య దేశాల్లో మన భారతదేశం ఎంతో అడ్వాన్స్‌గా ఉందని అది ఓటు ద్వారానే సాధ్యమవుతున్నదని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఎలక్టోరలల్‌ లిటరసీ క్లబ్‌ నోడల్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజల చేత ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి మన రాజ్యాంగం తయారు చేసుకోవడం జరిగిందని, దీనికి ప్రపంచంలోనే ఎంతో గౌరవం ఉందన్నారు.

దీనికి కారణం ప్రజలు వారికిష్టమైన ప్రజా ప్రతినిధులను ప్రభుత్వాలను విలువలతో కూడిన తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడమే అన్నారు. మన ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావాలంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని కూడా ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు ఎన్నికల సమయంలో వారు అందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఇందుకు పలు విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించడానికి, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి విద్యా సంస్థల నుండి నోడల్‌ అధికారులను నియమించడం జరిగిందన్నారు. ఈ అధికారులు తమ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని, ఇందుకై ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

ఎక్కువమంది ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుందనే నినాదాన్ని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ప్రతి పౌరునికి ఉన్నాయని, వాటిని పాటించవలసిన ధర్మం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

కావున అందరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించు కోవడానికి ఉద్యమంలా ముందుకు రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, స్వీప్‌ నోడల్‌ అధికారి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *