Breaking News

Daily Archives: January 30, 2020

మహోన్నత వ్యక్తి గాంధీజీ

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కాంగ్రెస్‌ భవన్‌లో గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం దేశ ప్రజలను ఏకం చేసిన మహోన్నతమైన వ్యక్తి గాంధీజీ అన్నారు. మతోన్మాదులు గాంధీని చంపిన గాడ్సేను పొగడడం చూస్తుంటే వారి దేశభక్తి గురువింద చందంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ...

Read More »

తుల్జాభవాని మాత ఆలయ వార్షికోత్సవం

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు నగరంలోని భవానినగర్‌లో శ్రీ తుల్జాభవాని మాత ఆలయంలో గురువారం ఏడవ వార్షికోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపారాధన, కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలతో పాటు అమ్మవారి శోభాయాత్ర చేపట్టారు. ఆలయ నిర్మాణ దాతలు పొలాస భాగ్యశ్రీ, సత్యనారాయణ, భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు.

Read More »

మునిసిపాలిటి అధ్యక్ష, ఉపాధ్యక్షులకు సన్మానం

బాన్సువాడ, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జరిగిన బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధ్యక్ష ఉపాధ్యక్షులు జంగం గంగాధర్‌, షేక్‌ జుబేర్‌ను బాన్సువాడ మండల సర్పంచ్‌ ల ఫోరమ్‌ తరపున సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు మండల సర్పంచ్‌ల ఫోరమ్‌ అధ్యక్షుడు నారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Read More »

మహాత్మునికి ఘన నివాళి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పరిషత్‌ భవన ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య అఫిషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ తరఫున పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ గాంధీజీ జాతికి ఉపదేశించిన అత్యుత్తమ మార్గాలైన అహింస, శాంతి ద్వారా ఎంత పెద్ద సమస్యనైనా సాధించగలమని భారత పౌరులందరూ జాతి సమైక్యతకు తమ వంతు కషి జరపాలని, వారు ఉపదేశించిన మార్గమే వారిని ...

Read More »

భూగర్భజలాలపై అవగాహన

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం మాచారెడ్డి మండలంలోని ఏల్పుగొండ గ్రామంలో జిల్లా భూగర్భ జల శాఖ మరియు రిలయన్స్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా భూగర్భ జలాల సమాచారం, యాజమాన్యం, సంరక్షణ మరియు అభివద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా భూగర్భ శాఖ అధికారి శ్రీనివాస్‌ బాబు గారు ఫ్లెక్సీలతో భూగర్భ జల సమాచారాన్ని, జల చక్రం ద్వారా నీరు రకరకాల ప్రక్రియల ద్వారా భూమిపై పడిన నీరు మళ్ళీ ఆవిరి రూపంలో మేఘాలుగా మారి వర్షం ...

Read More »

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణి

ఆర్మూర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని అన్ని గ్రామాల లబ్దిదారులకు గురువారం ఆర్మూర్‌ ఎమ్మల్యే జీవన్‌ రెడ్డి క్యాంపు ఆఫీస్‌లో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ చెక్కులను అందజేశారు. 304 మంది లబ్ది దారులకు ఒక్కొక్కరికి 1 లక్ష 1 వంద 16 రూపాయల చొప్పున పంపిణి చేశారు. ఇందులో బిసి – 245 మందికి – 2,43,55,188 రూపాయలు, మైనారిటీ 59 మందికి – 58,81,844 రూపాయలు, మొత్తం 304 మందికి – 3 కోట్ల ...

Read More »

ఘనంగా వసంతపంచమి వేడుకలు

రెంజల్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని సరస్వతి విద్యానికేతన్‌ పాఠశాలలో గురువారం వసంతపంచమిని పురస్కరించుకుని ఉపాద్యాయులు, విద్యార్థులు సరస్వతిదేవి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More »

ఆర్మూర్‌లో కార్డన్‌ సెర్చ్‌

ఆర్మూర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాజారామ్‌ నగర్‌ కాలనీ, యోగేష్వర్‌ కాలనీలలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఉదయము 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు నిర్వహించిన నిర్బంధ తనిఖీల్లో ఎలాంటి కాగితాలు లేకుండా అనుమనాస్పదంగా ఉన్న ద్విచక్ర వాహనలు 73, ఆటోలు 02, కార్లు 02, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికీ సంబందించిన దవపత్రాలు చూపించి తీసుకోవాలని సీపీ సూచించారు. కార్డెన్‌ సెర్చ్‌ కు నిజామాబాద్‌ పోలీస్‌ ...

Read More »

మన పట్టణము మన వార్డు మన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 25 వార్డులో మన పట్టణం మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్‌ ఆశన్న గారి జీవన్‌ రెడ్డి ప్రారంభించారు. కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో సమస్యలను పరిష్కరించే విధంగా కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని, పట్టణంలోని 36 వార్డుల్లో కార్యక్రమం నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్మూర్‌ను ...

Read More »

మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించిన అధికారులు

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 30న జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. గురువారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా రెవిన్యూ అధికారి అంజయ్య, డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది హాజరై స్వాతంత్ర సమరయోధులకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు.

Read More »

పదవి బాధ్యత స్వీకరణ మోహోత్సవం

ఆర్మూర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపాలిటీలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఛైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత, వైస్‌ చైర్మన్‌ షేక్‌ మున్నుల పదవి బాధ్యత స్వీకార కార్యక్రమం గురువారం ఆర్మూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్మూర్‌ పట్టణ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గెలిపించిన వార్డు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ఆర్మూర్‌ పట్టణంలోని 36 వార్డుల అభివ ద్ధి ప్రణాళిక ...

Read More »

నివాస గహాల వివరాల సేకరణకు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెన్సస్‌ ఇండియా 2021 లో భాగంగా నివాస గహాల వివరాల సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఆర్‌. అంజయ్య తెలిపారు. సెన్సస్‌ ఇండియా 2021 పురస్కరించుకొని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో చార్జ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన డిఆర్‌ఓ మాట్లాడుతూ ఏప్రిల్‌ నుండి నిర్వహించే హౌస్‌ లిస్టింగ్‌ కొరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సర్వే కొరకు వెళ్లే సిబ్బందికి అవసరమైన సూచనలు ...

Read More »

దిశను తెలియజేసే సూచిక బోర్డు ఏర్పాటు

రెంజల్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బాగేపల్లి గ్రామానికి వెళ్లడానికి దిశను తెలియజేసే సూచికబోర్డును సర్పంచ్‌ సాయిలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగేపల్లి గ్రామానికి వెళ్లడానికి దిశను తెలియజేసే బోర్డు లేకపోవడంతో కొత్తగా వచ్చే ప్రయాణికులకు రోడ్డు మార్గం తెలియకుండా మరొక మార్గం గుండా వెళ్లి ఇబ్బందులు పడుతుండంతో దిశను నిర్దేశించే బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఆయన వెంట గ్రామస్థులు ఉన్నారు.

Read More »

అవగాహనతోనే కుష్ఠు వ్యాధి నిర్మూలన

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవగాహనతోనే కుష్ఠు వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని నిజామాబాదును కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరూ కషి చేయవలసిన అవసరం ఉందని సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం కొత్త అంబేద్కర్‌ భవన్‌లో జాతీయ కుష్టు నిర్మూలన పక్షోత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ తరఫున ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధి నిర్మూలనకు ముందుగా ప్రజలందరిలో ...

Read More »

జగముల నేలెడు వాడును

జ గ డ ము పాదాదిగ కం.ప. జగముల నేలెడు వాడును గగనపు టంచుల కవతల గలవాడును వే డగనాశ్రిత గజరాజుకు ముగిలి నొసంగిన విభుండు మురహరి వాడెన్. (ముగిలి – మోక్షము ) తిరునగరి గిరిజా గాయత్రి

Read More »