Breaking News

Daily Archives: January 31, 2020

పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోలు కార్యక్రమం

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ శాఖలో జనవరి 31 వ తేదీ శుక్రవారం ఐదు మంది సిబ్బంది పదవి విరమణ చేయడం జరిగిందని పోలీసు కమీషనర్‌ కార్తికేయ వెల్లడించారు. వీరిలో జనవరి నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది విశేషు రామ్‌ వాయక్‌, సి.ఐ, సి.సి.ఎస్‌., నిజామాబాద్‌, పోలీసు శాఖలో 38 సంవత్సరాల సర్వీసు పూర్తిచేశారు. అలాగే ఎమ్‌.శంకర్‌, ఎస్‌.ఐ, టౌన్‌ 4 పి.యస్‌., నిజామాబాద్‌, పోలీస్‌ శాఖలో 39 సంవత్సరాల సర్వీసు పూర్తిచేశారు. ఎన్‌. ...

Read More »

బిచ్కుందలో ప్రజావాణి

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నెల మొదటి శనివారం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా శనివారం ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లా అధికారులందరూ ప్రజావాణి కార్యక్రమానికి హాజరవుతారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు తమ ఫిర్యాదులను ప్రజావాణి కార్యక్రమంలో అందించాలని ఆయన ప్రకటనలో తెలిపారు.

Read More »

ఆపద్బాంధవుడు కెసిఆర్‌

రెంజల్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపదలో ఉన్న కుటుంబానికి నేనున్నా అంటూ ఆదుకునే ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో సీఎం సహయనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెంజల్‌ మండలానికి మొత్తం13 చెక్కులు మంజూరు కాగా పేపర్‌ మిల్‌ గ్రామానికి 1, బాగేపల్లికి 1, కల్యాపూర్‌కు 1, కందకుర్తికి 2, రెంజల్‌ గ్రామానికి 7 మంజూరైన సీఎం సహయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ...

Read More »

ప్రతిభ పరీక్ష కరపత్రాలు విడుదల

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం శ్రీ ఆర్యభట్ట జూనియర్‌ కాలేజ్‌లో నిర్వహించనున్న పదవ తరగతి ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థుల ప్రతిభ పరీక్షకు సంబంధించిన కరపత్రాలను కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి నాగరాజు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించడం అభినందనీయమని, దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహన ...

Read More »

వంట ధరల మంట

నందిపేట్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిత్యవసరాల సరుకుల ధరలు మండిపోతున్నాయి. పప్పులు, కూరగాయలు, గుడ్లు ఇలా అన్ని పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మధ్యాహ్న భోజనం వంట చేస్తున్న నిర్వాహకులకు పెరుగుతున్న ధరల వల్ల ప్రతిరోజు కూరగాయలు, పప్పులు, వారంలో మూడు రోజులు కోడిగుడ్లను కొనుగోలు చేయడం తలకు మించిన భారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టం తెస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహణ ఏజన్సీలను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, కొత్త వారిని చూసుకోవాలని కొన్ని చోట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ...

Read More »

మాజీ సైనిక ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం ఆర్మూర్‌ రోడ్‌ లోగల శ్రీ రామ గార్డెన్స్‌లో ఫిబ్రవరి 1న ఉదయం 8 గంటల నుండి దక్షిణ భారత్‌ ఏరియా, తెలంగాణ, ఆంధ్ర సబ్‌ ఏరియా ఆధ్వర్యంలో ఆర్టిలరీ సెంటర్‌ హైదరాబాద్‌ చేత మాజీ సైనిక ఉద్యోగుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాలకు చెందిన మాజీ ...

Read More »

అన్ని గ్రామ పంచాయతీలలో పచ్చదనం, పరిశుభ్రతపై సమానంగా పనులు జరగాలి

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని గ్రామ పంచాయతీలలో కూడా పచ్చదనం, పరిశుభ్రతపై సమానంగా పనులు జరగాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం డిచ్‌పల్లి టీటీడీసీలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలలో నర్సరీల నిర్వహణ, యాజమాన్యం, నాటిన మొక్కలను నిర్వహించే విధానంపై జిల్లాస్థాయి శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, వాటిని ...

Read More »

శానిటేషన్‌ సిబ్బందిని సన్మానించిన కార్పొరేటర్‌

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ బంటు వైష్ణవి రాము శుక్రవారం శానిటేషన్‌ సిబ్బందిని సన్మానించారు. 26వ డివిజన్‌ అభివద్ధికి తమతో సహకరించే జోన్‌ 2 ఇంజనీరింగ్‌ సెక్షన్‌, శానిటేషన్‌ సిబ్బందికి మర్యాద పూర్వకంగా సన్మానిచండం జరిగిందన్నారు. తమ పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని సిబ్బంది ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Read More »

వెల్నెస్‌ సెంటర్‌లో నాణ్యమైన సేవలకు చర్యలు

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో పని చేస్తున్న వెల్నెస్‌ సెంటర్‌లో నాణ్యమైన సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌ నుండి వచ్చిన వెల్నెస్‌ కేంద్రాల ఇన్చార్జి అధికారి, ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ కేంద్రానికి సేవలకై హాజరయ్యే పెన్షనర్లు, ఉద్యోగులు, జర్నలిస్టుల కొరకు వారు సంతప్తి చెందే విధంగా సేవలు ...

Read More »