Breaking News

Monthly Archives: February 2020

పశువు తల‌పై అనుమానాలు

రెంజల్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామంలో శనివారం సాయంత్రం సమయంలో ఓ మతానికి చెందిన ధ్వజానికి కొద్దిదూరంలో పశువు తల‌ ఉండడంతో దీనిపై విచారణ చేపట్టాల‌ని ఎస్‌ఐ శంకర్‌కు గ్రామస్తులు కోరారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ శంకర్‌ ఈ విషయంపై విచారణ చేపడతామని పశువు తల‌ను ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తీసుకొచ్చి రోడ్డుపై పెట్టారా లేదా కొన్ని కుక్కలు చనిపోయినటువంటి పశువు తల‌ను లాక్కొని రోడ్డు పైకి తెచ్చాయా అనే దానిపై పూర్తిగా విచారణ జరుపుతామని ...

Read More »

ఏడవ ఎకనామిక్‌ సర్వే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో ఏడవ ఎకనామిక్‌ సర్వే గోడ ప్రతుల‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధ్యక్షతన ఆవిష్కరించారు. సర్వేలో అన్ని ఇండ్లల్లో పర్యటించి వ్యవసాయం మినహా ఇతర వృత్తులు నిర్వహించే కుటుంబాల‌ వివరాల‌ను సేకరించనున్నారు. ఆవిష్కరణలో సిపిఓ శ్రీ రాములు, ఆర్‌డిఓ వెంకటయ్య, సిఎస్సి జిల్లా సమన్వయకర్త శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

టెన్త్‌ విద్యార్థుల‌ స్నాక్స్‌ కొరకు ఆర్థిక సహాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షల‌కు సిద్ధమవుతున్న విద్యార్థుల‌ కొరకు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థుల‌కు సాయంత్రం స్నాక్స్‌ అందజేయడానికి గుండారం లోని క్లాసిక్‌ పేపర్ మిల్లు, రెంజల్‌లోని వివా బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుబ్బారావు, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డికి ల‌క్ష రూపాయల‌ చెక్కును సహాయం అందజేశారు. కలెక్టర్‌ ఇందుకు ఆయనను అభినందించారు.

Read More »

విద్యార్థుల‌కు పరీక్ష అట్టల పంపిణీ

కామారెడ్డి, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల‌ కేంద్రంలో శనివారం పార్శి విట్ఠల్‌ పటేల్‌ పేద విద్యార్థుల‌ సౌకర్యార్థం పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో వారికి ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. కళాశాల‌ అభివృద్దికమిటి అధ్యక్షుడు మాజీ జెడ్‌.పి.టి.సి సీనియర్‌ తెరాస నాయకుడు గండ్ర మధుసూదన్‌ రావు చేతుల‌మీదుగా మెటీరియల్‌ పంపిణీ చేశారు. మధుసూదన్‌ రావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి కాలేజీకి మంచి పేరు తేవాల‌ని, ఉపాద్యాయులు సహకరిస్తారని అన్నారు. ...

Read More »

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌కు ‘భగవద్గీత’

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సుదా నారాయణ మూర్తిని తిరుమల‌లోని వసతి గృహంలో నిజామాబాదుకు చెందిన మంచాల‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ మంచాల‌ జ్ఞానేందర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భగవద్గీత అందజేశారు. తిరుమల‌లో శ్రీ స్వామి వారి దర్శనానికి వెళ్లిన మంచాల‌ జ్ఞానేందర్‌ బస చేసిన వసతి గృహంలోనే ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ ఉన్నారని తెలియడంతో ఆమెను కలిసి శాలువతో సన్మానించి భగవద్గీత బహుకరించారు. ఆమె హర్షం వ్యక్తం చేస్తూ ఎవరూ ...

Read More »

పారిశుద్ధ్యం, పచ్చదనం అత్యంత ప్రాధాన్యం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారిశుద్ధ్య కార్యక్రమాలు, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. 23 వ వార్డు శకర్‌ నగర్‌, 35, 36 వార్డు షర్బత్‌ కెనాల్‌, 8వ వార్డు గాంధీ పార్క్‌, 28వ వార్డు మార్కెట్‌, 18వ వార్డు శ్రీనివాస్‌ నగర్‌ తదితర ప్రాంతాలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇతర సమస్యల‌పై స్థానిక ...

Read More »

అత్యవసర పరిస్థితిలో బాధితురాలికి రక్తదానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం రాత్రి నిజామాబాద్‌ బాబన్‌ సాహెబ్‌ పహాడ్‌లో నివాసం ఉంటున్న బిస్మిల్లాబీ బయటకు రాగా ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో శ్రీకృష్ణ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్టు వారి బంధువులు తెలిపారు. కాగా బిస్మిల్లాబి యొక్క రక్తం ఏ నెగిటివ్‌, చాలా అరుదైన రక్తం కావడంతో రాత్రి ఎంత ప్రయత్నించినా దొరక లేదు. ఇటువంటి స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి నిర్వాహకులైన గౌస్‌ మోయినుద్దీన్‌ ...

Read More »

ఎస్‌ఆర్‌లో వీడుకోలు వేడుక

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో గల‌ ఎస్‌ఆర్‌ డిజి పాఠశాల‌లో శుక్రవారం పదవ తరగతి విద్యార్థుల‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌ఆర్‌ డిజి జోనల్‌ ఇంచార్జ్‌ భగవాన్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించాలంటే, పట్టుదల‌ ఉండాల‌ని, పట్టుదల‌తో అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కొని, తమ అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని భగవాన్‌ రెడ్డి సూచించారు. విద్యార్థుల‌ను ...

Read More »

స్మశాన వాటిక నిర్మాణం పవిత్రమైన కార్యం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్మశాన వాటిక నిర్మాణం ఒక పవిత్రమైన కార్యం అని జిల్లాకలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. గ్రామాల‌లో అధికారులు స్మశానవాటిక. పనుల‌ను పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాల‌ని కలెక్టర్‌ ఆదేశించారు. శుక్రవారం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై మండల‌ స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల‌లో పూర్తిస్థాయి ట్యాక్స్‌ వసూలు మార్చ్‌ 15వ తేదీ వరకు పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గ్రామాల‌లో అటవీ సంరక్షణ కొరకు ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ ...

Read More »

పట్టణ రూపురేఖలు మార్చుదాం

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో శుక్రవారం జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమస్యల‌ పరిష్కారానికి ప్రజల‌కు ఇంతగా ప్రజల‌ చెంతకు అధికారులు, ప్రజా ప్రతినిధులు వస్తున్నారని, ప్రతి ఇంటికి ఆరు మొక్కల‌ను మున్సిపాలిటీ ద్వారా ఇస్తున్నామని, వాటిని నాటి సంరక్షించాల‌ని కోరారు. పట్టణాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దాల‌ని స్పీకర్‌ సూచించారు. పరిసరాల‌ పరిశుభ్రత పాటించాల‌ని, రోడ్లపై చెత్త వేసిన వారికి మున్సిపల్‌ అధికారులు రూ. 500 ...

Read More »

అక్రమాల‌కు పాల్పడితే చర్యలు

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ శుక్రవారం పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలు, ట్రాక్టర్ల కొనుగోలుకు రూపాయలు ల‌క్షా 75 వేల‌ కంటే అదనంగా డ్రా చేస్తే అటువంటి వారి నుంచి తిరిగి రికవరీ చేస్తామని జిల్లా కలెక్టర్‌ మండల‌ స్థాయి అధికారుల‌కు సూచించారు. డబ్బు చెల్లించని వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నాణ్యమైన ట్రాక్టర్లను ఏజెన్సీలు అందించాల‌ని కోరారు. అధికారులు నాణ్యమైన ట్రాక్టర్లు తీసుకొని పంచాయతీల‌కు ...

Read More »

ఆల‌య నిర్మాణానికి రూ. 10 ల‌క్షల విరాళం

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాబ్దిపూర్‌ గ్రామంలో శివాల‌యం, సాయిబాబా ఆల‌య నిర్మాణానికి దాత నిమ్మ అంజలి రెడ్డి (అమెరికా) భూమి పూజ చేశారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ యాదమ్మ పరశురాం, ఉప సర్పంచ్‌ చింత నాగరాజు, ఎంపిటిసి నిమ్మ జల‌జ ప్రభాకర్‌ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ అధ్యక్షుడు గణేష్‌ గౌడ్‌, గ్రామస్తులు, మాజీ ఎంపిటిసి నిమ్మ విజయ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాత అంజలిరెడ్డి పది లక్షలు ఆల‌య నిర్మాణానికి విరాళంగా ...

Read More »

పట్టణ ప్రగతి పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో 9, 10, 11, 16 వార్డుల‌లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ప్రజల‌తో సమస్యల‌ను అడిగి తెలుసుకున్నారు. 9, 10 వార్డుల‌లో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం, పిచ్చి మొక్కల‌ను తొల‌గించాల‌ని సూచించారు. పదో వార్డులో రైస్‌ మిల్‌ సమీపంలో పిచ్చిమొక్కలు అధ్వానంగా ఉండడంతో వాటిని రైస్‌ మిల్‌ యజమానితో శుభ్రం చేయించి, పరిశుభ్రత బోర్డు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. లింగాపూర్‌లో ...

Read More »

ప్రజల‌ భాగస్వామ్యంతోనే పట్టణాల‌ అభివృద్ధి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తేనే పట్టణ పరిధిలో భీమ్‌గల్‌ను సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి వీల‌వుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖ మాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగ‌తి కార్యక్రమంలో భాగంగా మంత్రి శుక్రవారం సంబంధిత అధికారుల‌తో కలిసి భీమ్‌గల్‌ పట్టణంలో మూడు గంటల‌ పాటు బెజ్జోర బైపాస్‌ రోడ్డు, నందిగుట్ట, అప్పర్‌ టేక్డితో పాటు పలు వీధుల‌లో పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల‌ ...

Read More »

మురుగు కాలువ‌లు, చెత్త ఉండొద్దు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతి సందర్భంగా ఈ పది రోజుల‌లో ఎక్కడ కూడా చెత్త మురుగు లేకుండా చర్యలు తీసుకోవాల‌ని డ్రెయిన్స్‌, పిచ్చి మొక్కలు ఉండవద్దని, వెంటనే తొల‌గించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆయన బుధవారం 1వ, 12 డివిజన్లలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాల‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకా మోరీలు అపరిశుభ్రంగా ఉండడం, రోడ్లపైన చెత్త వేయడంపై మీరేం చేస్తున్నారని సంబంధిత డివిజన్‌ కమిటీ సభ్యుల‌పై ఆగ్రహం వ్యక్తం ...

Read More »

కామారెడ్డి పట్టణ ప్రగతి శూన్యం

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హల్‌లో శుక్రవారం మాజీ మంత్రి షబ్బిర్‌ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం చాలా మంచిదని, కానీ అమలు సాధ్యమేనా అనేది ప్రశ్నార్థకంగా ఉందన్నారు. పట్టణ ప్రగతిలో అధికారులు సరిగా రావడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల‌ చేయలేదని షబ్బీర్‌ విమర్శించారు. కేవలం కేంద్రం ...

Read More »

మోడల్‌ పాఠశాల‌లో సైన్స్‌ దినోత్సవం

రెంజల్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల‌ కేంద్రంలోని మోడల్‌ పాఠశాల‌లో జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల‌ ఉపాధ్యాయ సిబ్బంది సర్‌ సివి రామన్‌ చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం సైన్స్‌ మేళ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సృజనాత్మకతతో పనికిరాని వస్తువుల‌ను ఉపయోగించి కళాత్మకమైన వస్తువుల‌ను రూపొందించారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన సైన్స్‌, బయాల‌జీ, సామాజిక శాస్త్రాల‌కు సంబంధించిన సాంకేతిక పరికరాలు ఆహూతుల‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ...

Read More »

కామారెడ్డిలో పట్టణ ప్రగతి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 47వ వార్డు కౌన్సిల‌ర్‌ గెరిగంటి స్వప్న ల‌క్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 4వ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా మున్సిపల్‌ చైర్మన్‌ కుమారి నిట్టు జాహ్నవి, గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొని ఆ ప్రాంతంలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో ...

Read More »

రసాయన శాస్త్రంలో అనిల్‌కు డాక్టరేట్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రసాయన శాస్త్రం విభాగంలో పరిశోధక విద్యార్థి తల‌కొక్కుల‌ అనిల్‌కు ఉస్మానియా విశ్వవిద్యాయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది. స్టీరియో సెలెక్టివ్‌ సింథిసిస్‌ ఆఫ్‌ నాచురల్‌ లాక్టోన్స్‌ ఆస్పర్జిల్లాయిడ్‌ డి, డైసిడియోటైడ్‌ ఎ,బి, డిహైడ్రోరిసోర్సిలైడ్‌, సింథసిస్‌ ఆఫ్‌ ఆర్టికిక్కియనోల్‌ ఎ.సి, ఆల్పిస్సిమకౌమరిన్‌ `డి అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి అనిల్‌కు డాక్టరేట్‌ ప్రదానం చేసినట్టు ఓయు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ తెలిపారు. కామారెడ్డి, బతుకమ్మ కుంట పద్మానగర్‌ కానీకి చెందిన ...

Read More »

మహిళ కడుపులో ఐదు కిలోల‌ కంతి

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం ఉదయం ఓ మహిళ కడుపు నుండి 5 కిలోల‌ కంతిని శస్త్రచికిత్స చేసి తీసినట్టు ప్రముఖ సర్జన్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌. బి.నాగేశ్వరరావు తెలిపారు.

Read More »