Breaking News

Daily Archives: February 1, 2020

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

రెంజల్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట గ్రామానికి చెందిన మల్లెపల్లి ప్రశాంత్‌, శ్రీ చరణలు శనివారం నిజామాబాద్‌ ఏసీపీని కలిసి రక్షణ కల్పించాలని కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ చర్చ్‌లో పెళ్లి చేసుకున్నామని, ఇద్దరం మేజర్లమని అమ్మాయి తరఫు వారి నుండి తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ ఏసీపీని ఆశ్రయించినట్లు ప్రేమజంట పేర్కొన్నారు. వీరన్నగుట్ట గ్రామం రెంజల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్నందున రెంజల్‌ పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలని ఏసీపీ వారికి సూచించారు.

Read More »

సిసి కాల్వల పనులు ప్రారంభం

రెంజల్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బిసి కాలనీలోని రోడ్డుకిరువైపులా సిసి డ్రైనేజీ పనులను సర్పంచ్‌ రమేశ్‌ కుమార్‌ ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. ఎంపిడివో గోపాలకృష్ణ, ఎంపివో గౌస్‌ మోయినోద్దీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, వార్డు సబ్యులు వెంకటి, స్థానికులు పోచయ్య, నారాయణ, కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.

Read More »

పశువులకు గాలికుంటు టీకాలు

రెంజల్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలో శనివారం 110 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేసినట్లు పశు వైద్యాధికారి విఠల్‌ తెలిపారు. శిబిరాన్ని స్థానిక సర్పంచ్‌ రొడ్డ విజయ లింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌, వైద్యాదికారి మాట్లాడారు. ఆవులు, గేదెలు, దూడలకు గాలి కుంటు వ్యాధులు సోకకుండా వుండేందుకు ముందస్తుగా చర్యలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. శిబిరంలో గ్రామ పెద్దలు దేవిదాస్‌, లింగం, సిబ్బంది శశిరేఖ, పుష్ప, శిల్ప, యశ్వంత్‌, రైతులు పాల్గొన్నారు.

Read More »

కంపోస్టు షెడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన

రెంజల్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రం సమీపంలోగల కాంట వద్ద కంపోస్ట్‌ షెడ్డు నిర్మాణానికి శనివారం సర్పంచ్‌ రమేశ్‌ కుమార్‌, ఎంపిడివో గోపాలకృష్ణ స్థల పరిశీలన చేశారు. తడి, పొడి చెత్తను వేరు వేరుగా ఉంచేందుకు స్టోరేజి కోసం షెడ్డు నిర్మాణం చేపడుతున్నట్టు సర్పంచ్‌ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రూ.2.6 లక్షల నిదులతో పనులకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. తడి, పొడి చెత్త ఎరువుగా మారితే పంచాయతీకి ఆదాయం చేకూరుతుందని సర్పంచ్‌ తెలిపారు.

Read More »

7 వరకు పల్లె ప్రగతి పనులు పూర్తి కావాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే శుక్రవారం కల్లా పల్లె ప్రగతి పనులు అన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మండలస్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం మండల ప్రత్యేక అధికారులైన జిల్లా అధికారులు, ఆర్‌డివోలు, తహసిల్దార్‌లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీఓలతో పల్లె ప్రగతి కార్యక్రమాలపై మండలాల వారీగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, వాటికి కంపోస్టు షెడ్లు నిర్మించాలని స్మశానవాటికలు పూర్తిచేయాలని, ...

Read More »

నూతన పాలకవర్గం కొలువుదీరింది

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం శనివారం కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి అధికారికంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఛైర్మన్‌ పీఠంపై కూర్చుని ఫైలుపై సంతకం చేశారు. నూతన చైర్‌ పర్సన్‌కు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. కామారెడ్డి మున్సిపాలిటీ అభివద్ధికి కషి ...

Read More »

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం

బాన్సువాడ, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని శనివారం శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 5గంటలకు వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి గహప్రవేశం నిర్వహించారు. అనంతరం తన సతీమణి పుష్పతో కలసి నూతన గ హంలో పాలు పొంగించి గణపతిపూజ, వాస్తు పూజ, హోమం, సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం అధికారులతో కలసి అధికారికంగా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని స్పీకర్‌ పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ...

Read More »

పట్టణ ఆరోగ్య కేంద్రం తనిఖీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి శనివారం పట్టణంలోని మాలపల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టరు పరిశీలించగా మెడికల్‌ ఆఫీసర్‌ సయ్యద్‌ అజ్మల్‌ నైమన్‌ సెలవు దరఖాస్తు లేకుండా హాజరు కానట్లు పరిశీలించారు. ఆయనను సంజాయిషీ అడగవలసినదిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తనిఖీ సందర్భంగా రోగులకు రాసి ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌లు సరిగా పాటించడంలేదని, ఎవరు రాస్తున్నారో వివరాలు నమోదు చేయడం లేదని తద్వారా ఏమైనా ...

Read More »

ఘనంగా వెంకటేశ్వర కళ్యాణం

రెంజల్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రథసప్తమిని పురస్కరించుకొని మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వేదపండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రతి సంవత్సరం రథసప్తమిని పురస్కరించుకుని వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కాశం నిరంజని, ఉప సర్పంచ్‌ జలయ్య, రైతు సమన్వయ ...

Read More »

మంచి ప్రమాణాలతో విద్యార్థులు వెళ్లాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులను మంచి ప్రమాణాలతో తీర్చిదిద్ది వారు భవిష్యత్తులో మంచి హోదాలో స్థిర పడే విధంగా కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పరీక్షలలో నఖల్‌ కొట్టడానికి ఏ మాత్రం అవకాశం ఉండదని ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. శనివారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మాడల్‌ విద్యాశాలల ప్రిన్సిపాల్స్‌, ఎయిడెడ్‌ స్కూల్స్‌, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు ...

Read More »

పేదల స్థలాలు అన్యాక్రాంతం చేయడం మానుకోవాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలోని అబ్దుల్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ సాదక్‌ అనే పేద కుటుంబానికి చెందిన ఇంటి స్థలం బాబూ మియా అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్లు తీసుకొచ్చి ముస్లిం కమ్యూనిటీ పెద్దలతో కబ్జా చేయాలని చూడడం సరైన చర్య కాదని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం, జబ్బర్‌ అన్నారు. ఈ సందర్భంగా రామారెడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రామారెడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి మైనార్టీ మత పెద్దలు ...

Read More »

మాజీ సైనికులను స్మరించుకోవడం మన బాధ్యత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ సేవకే అంకితమై ప్రాణాలను అర్పించిన సైనికులను గుర్తు చేసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు సహాయం అందించడం ద్వారా వారిలో ధైర్యం ఇనుమడిస్తుందని, అది మన బాధ్యత అని దక్షిణ భారత ఏరియా కమాండింగ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పిఎన్‌ రావు తెలిపారు. శనివారం నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలలోని మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై స్థానిక శ్రీరామ గార్డెన్లో ...

Read More »

గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తెలంగాణ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నుండి 35 రోజులపాటు కొనసాగే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం శనివారం సుర్బీర్యాల్‌ గ్రామంలో ఆర్మూర్‌ మండల ఎంపీపీ ప్రారంభించారు. శనివారం 258 పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. సోమవారం ఇదే కార్యక్రమం సుర్బీర్యాల్‌ గ్రామంలో కొనసాగుతుందన్నారు. పాడి రైతులు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి గ్రామంలో ఏ ఒక్క పశువుకు కూడా టీకా వేయకుండా ఉండకుండా పశువైద్య సిబ్బంది ఒక్కో గ్రామానికి రెండు రోజులు ఉదయం ...

Read More »

ఉత్తమ ఉద్యోగులకు సన్మానం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం వేల్పూరు గ్రామ పంచాయతీలో బిల్‌ కలెక్టర్‌గా ఉద్యోగ విరమణ చేసిన భోగ గణేష్‌ను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్‌ తీగల రాధ మోహన్‌ అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. గణతంత్ర వేడుకల్లో ఉత్తమ ఉద్యోగులుగా అవార్డ్‌ అందుకున్న డి.యల్‌.పి.ఓ పి.వి శ్రీనివాస్‌, యస్‌.ఐ. శ్రీధర్‌ గౌడ్‌ , యం.అర్‌.ఓ ఆఫీస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ శరత్‌, యస్‌.బి.ఐ బ్యాంక్‌ మెనేజర్‌ రాజు, ఉపాధి హామీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ రామ గౌడ్‌, ట్రాన్స్‌కో లైన్‌ మెన్‌ ...

Read More »

వేతన సవరణ కోసం ఉద్యోగుల సమ్మె

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో గత రెండు రోజులుగా వేతన సవరణ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు డిమాండ్‌ చేస్తున్నాయి. తమ జీతాలను 20 శాతం పెంచాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పబ్లిక్‌ సెక్టార్‌ యూనియన్‌ బ్యాంకులు కోరుతున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిరసనకు దిగుతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి రెండురోజుల పాటు తమ స్ట్రైక్‌ కొనసాగనుందని స్పష్టంచేశారు. రెండురోజులపాటు స్ట్రైక్‌ చేస్తున్నామని యూనైటెడ్‌ ...

Read More »

మర్యాదగా బతకమన్నందుకు మేనత్తను చంపేశాడు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సక్రమంగా పనిచేసుకొని, ఎలాంటి చెడు తిరుగుళ్లు తిరగకు, మర్యాదగా బ్రతకమని మందలించించినందుకు వరుసకు మేనత్త అయిన లక్ష్మి (43) ను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసిన ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని ఆదర్శ నగర్‌లో లక్ష్మి (43) కూలి పని చేస్తూ నివాసం ఉండేది. లక్ష్మికి వరుసకు మేనల్లుడు దంతేవడా సాయిలు (20) ...

Read More »

హెల్మెట్‌ అవగాహన ర్యాలీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రాఫిక్‌ ఏరియాలో తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, అవగాహన కొరకు హెల్మెట్‌ ధరించిన 200 మంది పోలీస్‌ అధికారులు, సివిల్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలో శనివారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా పోలీసు కమీషనర్‌ కార్తికేయ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డిసిపి ఉషా ...

Read More »