Breaking News

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం

బాన్సువాడ, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని శనివారం శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 5గంటలకు వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి గహప్రవేశం నిర్వహించారు.

అనంతరం తన సతీమణి పుష్పతో కలసి నూతన గ హంలో పాలు పొంగించి గణపతిపూజ, వాస్తు పూజ, హోమం, సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం అధికారులతో కలసి అధికారికంగా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని స్పీకర్‌ పోచారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో శాసనసభ్యులకు ప్రత్యేక క్యాంప్‌ ఆఫీసుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించి నిర్మించిందన్నారు. శాసనసభ్యులు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా ఉండటంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండడానికి కార్యాలయం ఉపయోగపడుతుందని చెప్పారు.

ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో లేనప్పుడు వ్యక్తిగత సహాయకులు ప్రజల నుండి ఫిర్యాదులను, సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలు స్వీకరిస్తారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, జిల్లా కలెక్టర్‌ యన్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేతా రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

పోచారం ట్రస్టు ఆధ్వర్యంలో బియ్యం, నిత్యవసర సరుకుల‌ పంపిణీ

బాన్సువాడ, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి నివారణకు విధించిన లాక్‌ డౌన్‌ నేపధ్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *