Breaking News

కందుల కొనుగోలుకు అన్ని చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కెట్‌కు కందులు తీసుకువచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం 13వేల క్వింటాళ్ల కందులు సేకరించామని, ఈ సంవత్సరం సుమారు తొమ్మిది వందల హెక్టార్లలో కంది పంట సాగు చేశారని, సుమారు 15 వేల క్వింటాల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు.

అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆర్మూర్‌, కోటగిరి, బోధన్‌, నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులలో కంది కొనుగోలుకు చర్యలు తీసుకున్నందున 159 క్వింటాళ్లు సేకరించామని తెలిపారు. మన రైతుల నుండే కందులు కొనుగోలు చేయాలని ఆయన ఆదేశించారు. మన దగ్గర మంచి ఎంఎస్‌పి ఉన్నందున మహారాష్ట్ర నుండి వచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా చెక్‌ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలని, అక్కడి నుండి కందులు రాకుండా కట్టడి చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత వ్యవసాయ అధికారుల చేత ధ్రువపత్రం తెప్పించుకోవాలని సూచించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ అంజయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ ప్రవీణ్‌ రెడ్డి, ఉద్యానవన శాఖ డిడి, డిఎం సివిల్‌ సప్లై డిసిఎస్‌ఓ, ఏడి మార్కెటింగ్‌ రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సొంతింటి (కల) గానే మిగిలిపోయింది…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ఆశపెట్టి ...

Comment on the article