Breaking News

ఎస్టిపిని పరిశీలించిన కలెక్టర్‌, కమిషనర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక దుబ్బ ప్రాంతంలో నిర్మించిన సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ (మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రం) ను కలెక్టర్‌ నారాయణ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలను పరిశీలించి ఎక్కడికక్కడ మున్సిపల్‌ ఇంజనీర్‌ ఆనంద్‌ సాగర్‌ను, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్‌ తిరుపతి కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్‌ లైన్లను పూర్తిచేయాలని, వేసవిని దష్టిలో పెట్టుకొని త్రాగునీరు ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుండే ప్రణాళికతో మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు కమిషనర్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ డిప్యూటీ ఈఈ రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

గంగమ్మ తల్లికి పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఊర చెరువు నిండు ...

Comment on the article