Breaking News

సహకార ఎన్నికలు లైట్‌గా తీసుకోవద్దు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్లు తక్కువగా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల్లో 70 శాతం పైగా పోలింగ్‌ కేంద్రాలు ఉన్న సహకార ఎన్నికలను లైట్‌గా తీసుకోవద్దని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులకు ఏర్పాటు చేసిన సహకార ఎన్నికల సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

మరో రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతోపాటు ఆ తర్వాత ప్రక్రియ ఒకదాని తర్వాత ఒకటి చేయవలసి ఉంటుందని, పోలింగ్‌ లొకేషన్లలో ఎక్కువగా పోలింగ్‌ స్టేషన్లు ఉన్నందున ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలన్నారు. అభ్యర్థులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉన్నదని బ్యాలెట్‌ పేపర్‌తో పాటు అన్ని విషయాలు పక్కాగా చూసుకోవాలన్నారు.

ఈనెల 15వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ఉంటుందని, అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు కూడా ఉన్నందున అది కూడా పూర్తి చేయవలసి ఉంటుందని, అధికారులు అన్ని విషయాలను ఏర్పాట్లను జాగ్రత్తగా నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ విద్యుత్‌ సరఫరా ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

పోలింగ్‌ లొకేషన్లో 13 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నందున ఓటర్లు గందరగోళానికి గురికాకుండా బోర్డులు ఏర్పాటు చేయాలని హెల్ప్‌ డెస్క్‌ ఉంచాలని సూచించారు. ఎక్కడైనా ఈ పదవులకు వేలం పెట్టినట్లు సమాచారం ఉంటే సంబంధితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ లొకేషన్లో కనీసం వెయ్యికి పైగా ఓటర్లు ఉండే అవకాశమున్నందున బందోబస్తు పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రహరీలు లేని పోలింగ్‌ కేంద్రాలకు మరింత భద్రత ఏర్పాటు చేయాలని ఏసీపీలను ఆదేశించారు. గత అనుభవాలను దష్టిలో పెట్టుకుని ఎక్కడైనా సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలు ఉంటే గుర్తించి శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో డిఆర్‌వో అంజయ్య, డిసిఓ సింహాచలం, ఆర్డీవోలు శ్రీనివాస్‌, గోపిరామ్‌, ఏసీపీలు శ్రీనివాస్‌ కుమార్‌, రఘు, జైపాల్‌ రెడ్డి, జిల్లా అధికారులు, సహకార శాఖ అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *