Breaking News

సత్ప్రవర్తనతోనే దేశాభివృద్ది

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జె.సి.ఐ ఇందూరు ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని బ్లూమింగ్‌ బర్డ్స్‌ పాఠశాల, అరబిందో హైస్కూల్‌లలో జాతీయ సమగ్రత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సత్ప్రవర్తన, నిజాయితీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జేసిఐ జోన్‌ ఆఫీసర్‌ జిల్కర్‌ లావణ్య మాట్లాడుతూ సత్ప్రవర్తనతోనే దేశ అభివద్ధి సాధ్యమని, విద్యార్థి దశలోనే నీతి, నిజాయితీ అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ఉద్బోదించారు.

సమగ్రత దినోత్సవ కార్యక్రమం జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జె.సి.ఐ ఇందూరు కార్యదర్శి తక్కూరి హన్మాండ్లు, ప్రోగ్రామ్‌ చేర్మెన్‌ నరహరి నాయక్‌, బ్లూమింగ్‌ బర్డ్‌ ప్రిన్సిపాల్‌ సుపర్ణ, అరబిందో హై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సంధ్యలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

గంగమ్మ తల్లికి పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఊర చెరువు నిండు ...

Comment on the article