Breaking News

కష్టపడి చదివి మంచి మార్కులతో వెళ్ళండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు పదవ తరగతి అత్యంత ముఖ్యమైన దశ అని, ఎంత కష్టపడి చదివితే భవిష్యత్తు అంత బాగుంటుందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. మంగళవారం న్యాల్‌కల్‌ రోడ్‌లోని ప్రభుత్వ సమీకత బాలుర వసతి గహ సముదాయంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు టెన్త్‌ చాలా ముఖ్యమైనదని, పాస్‌ కావడం కంటే మంచి నాలెడ్జితో కష్టపడి మంచి మార్కులతో బయటకు వెళ్లడమే భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని తెలిపారు. అప్పుడే జీవితంలో చేరడానికి ఒక మంచి దారి గుండా వెళ్లడానికి అవకాశం ఉంటుందని, లేదంటే ఏదో పాస్‌ అయితే అనుకున్న స్థాయిలో స్థిరపడడానికి అవకాశం ఉండదన్నారు.

కెరీర్‌ పరంగా బాగున్నప్పుడు మంచి నైపుణ్యాలు పొందినప్పుడు పోటీ రంగంలో విజయం పొందడానికి, తద్వారా లక్ష్యానికి అనుగుణంగా జీవితంలో స్థిరపడడానికి వీలు కలుగుతుందని తెలిపారు. సమస్యలు అందరికీ ఉంటాయని, సాకులు చూపించి కష్టపడకుండానే తదుపరి మీరే కష్ట పడతారని పేర్కొన్నారు. మీ ముందున్న ఫోటోలో కనిపిస్తున్న బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కూడా ఎంతో కష్టపడ్డారని, ఆయన రచించిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా పేరు పొందిందని వివరించారు

నేర్చుకోవాలని ఉంటే ఏదైనా సాధ్యమే, ప్రభుత్వం ద్వారా మీకు ఎన్నో సదుపాయాలు ఉన్నాయని వాటన్నిటినీ సద్వినియోగం చేసుకొని కష్టపడి చదవాలని సూచించారు. సెల్‌ ఫోన్లు, సినిమాల గురించి ప్రస్తావిస్తూ వివేకానందుడు చెప్పినట్లు విజయానికి అడ్డుపడే దేన్నైనా విషంగా భావించినప్పుడు దేన్నయినా సాధించవచ్చు అన్నారు.

ఈ సందర్భంగా నేపాల్‌లో నిర్వహించిన క్రీడా పోటీలలో చెస్‌, రన్నింగ్‌, ఖోఖోలలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో డిఎస్‌సిడిఓ శశికళ, సహాయ అధికారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article