Breaking News

కేంద్రం ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తుంది

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ సమైక్యతను లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే అంశంపై రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్నార్సీ సిఎఎలను వ్యతిరేకిస్తూ నిజామాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం జిల్లా సదస్సు నిర్వహించారు. సదస్సుకు న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వనమాల కష్ణ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడారు.

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను, తగ్గుతున్న జీడీపీ రేటును, ఆర్థిక సంక్షోభాన్ని, ప్రభుత్వ రంగాల అమ్మకాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోడీ, షాల ప్రభుత్వం ఒక మోసాన్ని తీసుకొచ్చిందన్నారు. అదే ఎన్నార్సీ, సిఎఎ అన్నారు. మోడీ ప్రభుత్వం అంబానీ ఆధాని తదితరుల కార్పొరేట్‌ కంపెనీలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. కేంద్రం ప్రజలను కులం, మతం పేరుతో విభజించి పాలన కొనసాగిస్తుందన్నారు.

అందులో భాగమే ఎన్నార్సీ, సిఎఎ బిల్లులను తీసుకువచ్చిందన్నారు. ఇది మనందరి సమస్య అని లౌకిక ప్రజాస్వామిక పౌరులందరి సమస్య అని అన్నారు. ఇది కేవలం ముస్లింల సమస్యగా చూడవద్దన్నారు. విద్వేషాన్ని ద్వేషించే వారంతా సమైక్యంగా పోరాడాలన్నారు. ఇప్పటికే 13 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నార్సీని అమలు చేయబోమని ప్రకటించారన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు యూనివర్సిటీ కేంద్రాలుగా పోరాడుతున్నారన్నారు.

మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక కుట్రలను సమైక్యంగా తిప్పికొడదాం, కలిసి పోరాడుదాం, అసలైన, నిజమైన దేశభక్తులమని చాటుదామని పిలుపునిచ్చారు. మానవ హక్కుల వేదిక అధ్యక్షులు మాధవరావు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వనమాల కష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, సిపిఎం జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, న్యూడెమోక్రసి భాస్కర్‌, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంగాధర్‌, భూమయ్య, పాపయ్య, వెంకన్న, రాజేశ్వర్‌, మల్లేష్‌, రామకష్ణ, నూర్జహాన్‌, ఓమయ్యా, సుధాకర్‌, గోవర్ధన్‌, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అరుణోదయ కళాకారులు పాటలతో అలరించారు.

Check Also

గంగమ్మ తల్లికి పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఊర చెరువు నిండు ...

Comment on the article