Breaking News

Daily Archives: February 5, 2020

17న డిప్యూటి సిఎంగా కెటిఆర్‌?

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్టు హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా అదేరోజు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జన్మదినం కావడం మరోవిశేషం. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త అంశం తెరపైకొచ్చినట్టు కనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా కెటిఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు భిన్నంగా కెటిఆర్‌ను డిప్యూటి సిఎంగా కెసిఆర్‌ నిర్ణయించినట్టు తాజా సమాచారం. గత ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటి ...

Read More »

సమాచార హక్కు చట్టం ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గ్రామపంచాయతీ కార్యదర్శులకు అఖిల భారతీయ ప్రజాసేవసమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు ఆధ్వర్యంలో 2005 సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్యామ్‌ రావు మాట్లాడుతూ గ్రామపంచాయతీ నుండి పార్ల మెంట్‌ వరకు ప్రజలు కోరిన సమాచారాన్ని కేవలం పది రూపాయల రుసుము చెల్లించి 30 రోజుల్లో పొందవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 48 గంటల్లోనే సమాచారాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ...

Read More »

పల్లె ప్రగతి అంశాల్లో ఏది కూడా పెండింగ్‌ ఉండకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్దేశించిన అంశాలలో ఏ ఒక్కటి కూడా పెండింగ్‌ లేకుండా అన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులు, బ్యాంకు అధికారులు ట్రాక్టర్ల డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే శుక్రవారం కల్లా అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు సమ కూర్చుకోవడానికి బ్యాంకు ఖాతాలు తెరవడం, డాక్యుమెంటేషన్‌ పూర్తిచేయడం మంజూరీలు ఇవ్వడం, ...

Read More »

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్‌ కవితారెడ్డి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లైంగిక వేధింపుల కమిటి చైర్మన్‌ డాక్టర్‌ కవితా రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని ఆయన చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలపై ఎలాంటి లైంగిక, ఇతరత్ర వేంధింపులకు గురి చేసినా చట్ట పర చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా కలెక్టర్‌కు కోరారు.

Read More »

ఎల్‌ఐసి రెండోరోజు నిరసన

ఆర్మూర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఎల్‌ఐసి బ్రాంచ్‌ ఆఫీసులో రెండవ రోజు నిరసనల జోరు కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసి వాటాలను స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడం తగదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున ఏజెంట్లు, ఉద్యోగులు నిరసన తెలిపారు. 64 సంవత్సరాలను నుండి ఇన్సూరెన్స్‌ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఇన్సూరెన్స్‌ సంస్థగా పేరుపొందిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసి వాటాలను ప్రైవేటు వాళ్ళకి అమ్మటం, స్టాక్‌ ...

Read More »

మాటలు కట్టిపెట్టి రైతులకు మేలు చేయండి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదులో సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి పార్లమెంటులో ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఏఐకెఎంఎస్‌ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌ అన్నారు. తాజాగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా రైతాంగం ఐక్యంగా పోరాటం చేశారని, పంటకు క్వింటాలుకు 15 వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని ఎర్ర జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన జరిగిందన్నారు. ఆనాడు పార్లమెంటు సభ్యురాలు కవిత రాష్ట్ర ప్రభుత్వం ...

Read More »

ఎంపి అరవింద్‌ రైతులను మోసం చేశారు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ వ్యాప్తంగా ఉన్న కాఫీ, రబ్బర్‌, తేయాకు బోర్డుల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు కావాలని కోరామని, కానీ స్పైస్‌ బోర్డును కోరలేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. స్పైస్‌ బోర్డు కొత్తగా ఏర్పాటు చేసింది కాదని, గతంలోనే వరంగల్‌లో స్పైస్‌ బోర్డు ఏర్పాటు చేశారన్నారు. వరంగల్‌లో కొనసాగుతున్న స్పైస్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయంతో ఒనగూరుతున్న ప్రయోజనమేమీ లేకపోగా.. నిజామాబాద్‌లో ...

Read More »

కలెక్టర్‌ను కలిసిన మాజీ మేయర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు నగర మాజి మేయర్‌ ఆకుల సుజాత శ్రీశైలం, మాజీ కార్పొరేటర్లు చాంగుబాయ్‌, సువర్ణ, తదితరులు గురువారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ పాలనలో జిల్లాతో పాటు నగరం అన్నివిధాలుగా అభివద్ధి చెందుతున్నదని విశ్వాసం వ్యక్తం చేశారు. తెరాస నాయకులు ఆకుల శ్రీశైలం, సిర్ప రాజు కూడా కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Read More »

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పండిత్‌ వినీత పవన్‌లను ఆర్మూర్‌ జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా తెరాస పార్టీ గులాబీ జెండాను కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే ఆర్మూర్‌ మునిసిపల్‌ నూతనంగా ఎన్నికైన చైర్‌ పర్సన్‌ పండిత్‌ వినీత పవన్‌లను ఆర్మూర్‌ జర్నలిస్టులు బుధవారం శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ సంఘం జిల్లా ...

Read More »

అంగన్‌వాడి చిన్నారులకు అన్నప్రాసన

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని లింగపూర్‌ గ్రామంలో అంగన్‌వాడి కేంద్రంలో బుధవారం కామారెడ్డి మున్సిపాలిటీలో వీలైనమైన లింగపూర్‌ గ్రామం నుంచి ఎన్నికైన నూతన కౌన్సిలర్లు 11 వ వార్డు కాసర్ల శ్రీనివాస్‌, 9 వ వార్డు సుగుణ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అంగన్‌వాడి టీచర్‌ ఉమారాణి మాట్లాడుతూ అంగన్‌వాడి కేంద్రం నిర్వహణలో సహకరించాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సెక్టార్‌ సూపర్‌వైజర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడిల సేవలను వినియోగించుకోవడంలో కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు ...

Read More »

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామాభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో చిన్న కాలువకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా రోడ్డు విషయమై గతంలో తీర్మానించారు. రోడ్డు నిర్మాణం వల్ల వ్యవసాయ రైతులు పొలాల్లోకి విత్తనాలు, ఎరువుల బస్తాలు తీసుకెళ్లడానికి సులభతరమవుతుందన్నారు. బోరు మోటార్లు పాడైపోతే రిపేరు చేయించడానికి రోడ్డు గుండా తీసుకెళ్లడానికి వీలుంటుందన్నారు. ఇటువంటి ఆలోచనతోనే రోడ్డు నిర్మాణం ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో శక్కరికొండ మోహన్‌, కుర్రి రామకష్ణ, ఉపసర్పంచ్‌ రంజిత్‌, గ్రామాభివద్ధి కమిటీ, ...

Read More »

రైతులను ప్రజలను నమ్మి రుణాలు ఇవ్వండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజలకు నమ్మకం కోల్పోకుండా జీవించే మంచి అలవాటు ఉన్నదని, వారిని నమ్మి రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి బ్యాంకర్లకు సూచించారు. బుధవారం పట్టణంలోని రాజ రాజేంద్ర చౌరస్తా వద్ద ఫెడరల్‌ బ్యాంక్‌ బ్రాంచిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రైతులను చిన్న వ్యాపారం చేసుకునే ప్రజలను బ్యాంకు అధికారులు నమ్మి వారికి సులభతరంగా రుణాలు మంజూరు చేయాలని, ప్రజలు కూడా అంతే నమ్మకంతో రుణాలు తిరిగి చెల్లిస్తారని ...

Read More »