Breaking News

రైతులను ప్రజలను నమ్మి రుణాలు ఇవ్వండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజలకు నమ్మకం కోల్పోకుండా జీవించే మంచి అలవాటు ఉన్నదని, వారిని నమ్మి రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి బ్యాంకర్లకు సూచించారు. బుధవారం పట్టణంలోని రాజ రాజేంద్ర చౌరస్తా వద్ద ఫెడరల్‌ బ్యాంక్‌ బ్రాంచిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రైతులను చిన్న వ్యాపారం చేసుకునే ప్రజలను బ్యాంకు అధికారులు నమ్మి వారికి సులభతరంగా రుణాలు మంజూరు చేయాలని, ప్రజలు కూడా అంతే నమ్మకంతో రుణాలు తిరిగి చెల్లిస్తారని తెలిపారు. ఏ వ్యాపారమైనా లాభాల కొరకే చేసేదని దానితోపాటు సమాజ హితాన్ని కూడా దష్టిలో పెట్టుకోవాలని తెలిపారు.

బ్యాంకింగ్‌ సెక్టార్‌లో బ్యాంకులు ప్రజలకు దగ్గరగా సేవలందించడానికి కషి చేస్తున్నాయని ప్రజలకు – బ్యాంకులకు మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. వ్యాపారాన్ని అభివద్ధి చేసుకుంటూనే వ్యవసాయ రంగానికి చేదోడుగా ఉండే ఆ రంగాన్ని కూడా అభివద్ధి దిశలో వెళ్లడానికి బ్యాంకర్లు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తే ఆ రంగం కూడా అభివద్ధి చెందుతుందని, తద్వారా దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుందని వివరించారు.

ప్రజలు కూడా తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించినప్పుడే బ్యాంకర్లు మళ్లీ మళ్లీ రుణాలు అందించటానికి అవకాశం ఉంటుందని తెలిపారు. బ్యాంకు సేవలు ఉపయోగించుకొని లబ్ధి పొందడం ప్రజల అభివద్ధికి కూడా పనికి వస్తుందని తెలిపారు. బయట వడ్డీలకంటే బ్యాంకు వడ్డీలు తక్కువగా ఉన్నందున ప్రజలు బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని తిరిగి చెల్లించడానికి కూడా కషిచేయాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో బ్యాంకు అధికారులు జలంధర్‌, మహిపాల్‌ రెడ్డి, నందకుమార్‌, రాజ్‌ నారాయణ, ఎల్‌డిఎం జయ సంతోషి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *