Breaking News

పల్లె ప్రగతి అంశాల్లో ఏది కూడా పెండింగ్‌ ఉండకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్దేశించిన అంశాలలో ఏ ఒక్కటి కూడా పెండింగ్‌ లేకుండా అన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులు, బ్యాంకు అధికారులు ట్రాక్టర్ల డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే శుక్రవారం కల్లా అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు సమ కూర్చుకోవడానికి బ్యాంకు ఖాతాలు తెరవడం, డాక్యుమెంటేషన్‌ పూర్తిచేయడం మంజూరీలు ఇవ్వడం, మార్జిన్‌ మనీ చెల్లించడం, ట్రెజరీలో బిల్లులు సమర్పించడం, సంబంధిత ట్రాక్టర్‌ డీలర్లకు చెల్లింపులు జరిగే విధంగా చూడడం, ట్రాక్టర్లను గ్రామ పంచాయతీలకు అందించడం తదితర కార్యక్రమాలన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు.

జిల్లాలో 530 గ్రామ పంచాయతీలకు గాను అన్నింటిలోనూ డంపింగ్‌ యార్డ్‌ల పనులు ప్రారంభమై చాలా వరకు పూర్తయ్యే దశలో ఉన్నాయని, వాటికి 518 కంపోస్టు షెడ్ల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు. అదేవిధంగా అన్ని గ్రామ పంచాయితీలలో నర్సరీలలో పనులు నడుస్తున్నాయని, 528 స్మశానవాటికలలో కూడా పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

ఇంకా భూ సమస్యలు ఎక్కడైనా ఉంటే వెంటనే వాటి పరిష్కారానికి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అటవీ అధికారులు చర్యలు తీసుకొని అన్నింటికీ కూడా భూ సేకరణ జరిగి పనులు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. ఎక్కడ కూడా ఏ అంశంలో కూడా సమస్య ఉన్నదనే ఫిర్యాదు రావద్దని, సమస్యలుంటే తన దష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

సమావేశంలో డిపిఓ జయసుధ, డిఆర్‌డిఓ రమేష్‌, ఎల్‌డిఎం జయ సంతోషి, ఈఈ పిఆర్‌ నీలకంఠేశ్వర్‌, ఎఫ్‌డిఓ రాములు, బ్యాంకు అధికారులు, ట్రాక్టర్‌ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *