Breaking News

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామాభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో చిన్న కాలువకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా రోడ్డు విషయమై గతంలో తీర్మానించారు. రోడ్డు నిర్మాణం వల్ల వ్యవసాయ రైతులు పొలాల్లోకి విత్తనాలు, ఎరువుల బస్తాలు తీసుకెళ్లడానికి సులభతరమవుతుందన్నారు.

బోరు మోటార్లు పాడైపోతే రిపేరు చేయించడానికి రోడ్డు గుండా తీసుకెళ్లడానికి వీలుంటుందన్నారు. ఇటువంటి ఆలోచనతోనే రోడ్డు నిర్మాణం ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో శక్కరికొండ మోహన్‌, కుర్రి రామకష్ణ, ఉపసర్పంచ్‌ రంజిత్‌, గ్రామాభివద్ధి కమిటీ, యువజన సంఘాలు, స్థానికులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *