Breaking News

ఇటుక బట్టి యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల‌ కేంద్రంలో వెంకట్‌ అనే ఇటుక బట్టి యాజమాన్యం బా ల కార్మికుల‌తో బల‌వంతంగా పని చేయిస్తూ వారి తల్లిదండ్రుల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆర్‌ఎస్‌పి జిల్లా బృందంగా తాము సందర్శించి వెంకటేశ్వర్లు ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించారని రెమ్యాషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కొత్త నరసింహ అన్నారు.

నిబంధనల‌కు విరుద్ధంగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లుపై చర్య కోసం స్థానిక పోలీసు వీఆర్వోని ఇటుక బట్టీ వద్దకు పిల‌వడం జరిగిందని, ఈ విషయాన్ని లేబర్‌ ఆఫీస్‌ జిల్లా ఉన్నతాధికారుల‌కు చెప్పడం జరిగిందన్నారు. ఇటుక బట్టీ యాజమాన్యాలు లేబర్‌ యాక్ట్‌ నమోదు చేయకుండా లాభార్జన ధ్యేయంగా పనిచేస్తూ ప్రశ్నించిన ఇటుక బట్టి కార్మికుల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారని ఆయన అన్నారు.

అధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాల‌ని లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేష్‌, కాశయ్య మ‌ల్ల‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *