Breaking News

కరోనా మందుల‌ పంపిణీ

కామారెడ్డి, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కల్కి ఆయంలో ప్రతి మంగళవారం అన్నదానంలో భాగంగా 16వ వారం నిర్వహించారు. అన్నదాతగా బిబీపేట గ్రామానికి చెందిన ఇల్లందు శ్రీనివాస్‌ దంపతులు అన్నదానం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్‌ చందు మాట్లాడుతూ అమ్మ భగవాన్‌ మానవ సేవాసమితి ఆధ్వర్యంలో గతంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ప్రపంచాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న కరోనా వైరస్‌ రాకుండా ముందు జాగ్రత్తగా రెండు వేల‌ మందికి మందు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

అన్ని దానాలో కెల్లా అన్నదానం గొప్పదని, అన్న దానం చేయడానికి ముందుకు వచ్చిన దాతను అభినందించారు. ప్రతి మంగళవారం 300 మందికి అన్నదానం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article