Breaking News

వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం క్యాసంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల‌ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌ రాజు సందర్శించారు. ఇందులో భాగంగా పదవ తరగతి విద్యార్థుల‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు రాసే విధానాన్ని గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిల్ల‌ల‌కు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాల‌ని, కష్టంతో కాదు ఇష్టంతో చదవాల‌ని సూచించారు.

తరువాత ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల‌ సమావేశంలో మాట్లాడుతూ ఉత్తేజం కార్యక్రమం క్రింద ఇచ్చినటువంటి అన్ని ఉత్తర్వుల‌ను తూ.చ తప్పకుండా పాటించి పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత ల‌క్ష్యంగా పనిచేయాల‌ని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల‌కు సాయంత్రం అల్పాహారం కొరకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించగా, ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో అల్పాహారం అందిస్తున్నామని, పాఠశాల‌ ప్రధానోపాధ్యాయుల‌ శ్రీపతి నివేదించారు.

తరువాత వారు మాట్లాడుతూ విద్యార్థుల‌కు విద్యా శాఖ తరఫున అందించే స్టడీ మెటీరియల్‌తో పాటు ప్రతి విషయ ఉపాధ్యాయుడు వారి వారి విషయాల‌లో ప్రత్యేకమైన అంశాల‌ను వెనుకబడిన పిల్ల‌ల కొర‌కు సూచిస్తూ వారిని 100 శాతం ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాల‌ని ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాల‌ని సూచించారు. సమావేశంలో పాఠశాల‌ ఉపాధ్యాయులు నరసింహారావు, సంతోష్‌, అఖిల్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 74 వ ...

Comment on the article