Breaking News

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

రెంజల్‌, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొర్గం గ్రామానికి చెందిన చిక్కే గంగారాం, కశిగొండకు చెందిన 30 గొర్రెల‌పై కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత పడ్డాయి. రోజు మాదిరిగానే గొర్రెలు షెడ్డులో నిద్రిస్తున్న సమయంలో కుక్క‌లు దాడి చేయడంతో కొన్ని చనిపోయాయి. మరికొన్ని గాయాల‌తో కొట్టుమిట్టాడుతున్నట్లు గమనించిన పెంపకం దారులు వెంటనే పశువైద్యాధికారుల‌కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న వైద్యాధికారులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

దీంతో పెంపకం దారులు ఆవేదనకు గురయ్యారు. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన గోర్లు మృతి చెందగా ల‌బ్దిదారుల‌ను ప్రభుత్వం ఆదుకోవాల‌ని కోరారు. గ్రామంలో కుక్క‌లు స్వైర విహారం చేస్తూ గొర్రెల‌పై దాడికి పాల్ప‌డుతున్నాయ‌ని పలుమార్లు పంచాయతీ సిబ్బందికి విన్నవించినా ఫలితం లేకపోయిందని గొర్ల పెంపకందారులు ఆవేదన వ్యక్తంచేశారు.

Check Also

వసతులులేని జూనియర్‌ కళాశాలల‌ అనుమతులు రద్దు చేయాలి

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాలోని సరైన వసతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న ...

Comment on the article