Breaking News

Daily Archives: February 12, 2020

షీ టీం కవితా సంపుటి ఆవిష్కరణ

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఉమశేషారావు వైద్య షీ టీం అనే కవిత సంపుటి రచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా డి.ఎస్‌.పి (సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌) ల‌క్ష్మి నారాయణ చేతుల‌ మీదుగా కవితా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సాహిత్య పరంగా షీ టీం, డయల్‌ 100 మీద కవితాత్మకంగా రాసినందుకు శేషారావును పలువురు అభినందించారు. గతంలో శేషారావు ఓటరు శతకం, తదితర రచనలు చేసి ప్రముఖ కవిగా పేరుగాంచారు.

Read More »

అంగన్‌ వాడి కేంద్రాల‌ తనిఖీ

రెంజల్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండంలోని పేపరిమిల్‌, కందకుర్తి గ్రామాల్లోని అంగన్‌వాడి కేద్రాల‌ను బుధవారం ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ ప్రమీల‌రాణి తనిఖీ చేశారు. అంగన్‌వాడి కేంద్రాల‌కు వచ్చే పిల్ల‌ల‌కు, గర్భిణిల‌కు, బాలింతల‌కు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం ఏ మేరకు అందుతుందని వారిని అడిగి తెలుసుకున్నారు. పోషక విలువల‌తో కూడిన ఆహార పదార్థాల‌ను అందిస్తూ వాటి ప్రాముఖ్యత తెల‌పాల‌ని, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్ల‌ల‌కు ప్రతి నెల‌ బరువు సూచిక తోపాటు క్రీడల‌ను పోషకాహార పదార్థాల‌ను అందిస్తూ వారి ఎదుగుదల‌కు కృషి ...

Read More »

ఐఐటీ నీట్‌ క్యాంప్‌కు ఎంపికైన విద్యార్థులు

బీర్కూర్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల‌ పాఠశాల‌ విద్యార్థులు 18 మంది రాష్ట్ర స్థాయి ఐఐటీ నీట్‌ కాంప్‌కు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల‌ కృషి, విద్యార్థుల‌ పట్టుదల వ‌ల్ల ఇంతటి ఫలితం దక్కినట్టు పాఠశాల‌ ప్రిన్సిపాల్‌ వసంత్‌ రెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులు త్వరలోనే భువనగిరి జిల్లా ఆనంతారంలో ప్రారంభించబడే పాఠశాల‌లో చేరుతారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల‌ను ప్రధానోపాధ్యాయుడు వసంత్‌ రెడ్డి, ఏటిపి రఘునాథ్‌ అభినందించారు. 8వ, 9వ తరగతి ...

Read More »

ఆధ్యాత్మిక భావన ప్రశాంతతను కలిగిస్తుంది

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈశ్వరీయ బ్రహ్మకుమారిల‌ ఆద్వర్యంలో నిజామాబాదులో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరాన్ని నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ బుదవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనారోగ్య, మానసిక సమస్యకు గురవుతున్న వారికి ధ్యానం, ఆధ్యాత్మిక భావన ప్రశాంతతను కలిగిస్తుందని అన్నారు. ప్రజలు ధ్యాన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో రాజయోగిని కుల్దీప్‌ బహన్‌జీ తదితరులు పాల్గొన్నారు.

Read More »

గ్రామపంచాయతీల‌కు ట్రాక్టర్‌ల అందజేత

రెంజల్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి సొంత ట్రాక్టర్‌ కలిగి ఉండాల‌నే ల‌క్ష్యంతో ట్రాక్టర్‌ల‌ను కొనుగోలు చేయడం జరుగుతుందని మండల‌ ప్రజాపరిషత్‌ అభివృద్ధి అధికారి గోపాల‌కృష్ణ అన్నారు. మండల‌ ప్రజాపరిషత్‌ కార్యాల‌యంలో బుధవారం వీరన్నగుట్ట, అంబేద్కర్‌ నగర్‌, పేపర్‌మిల్‌ గ్రామాల‌కు మంజూరైన ట్రాక్టర్‌ల‌ను తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, ఎంపీడీఓ గోపాల‌కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీల‌కు ట్రాక్టర్‌ను అందజేయడం అభినందనీయమని ట్రాక్టర్‌ల‌తో పాటు ...

Read More »

గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయానుకునే వారికి శుభవార్త

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయాల‌నుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన మంత్రి కౌశల్‌ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రిన్సిపాల్‌ వాసుదేవరెడ్డి తెలిపారు. ఎల‌క్ట్రీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వడంతో పాటు గల్ప్‌లోని ప్రముఖ కంపెనీల్లో ఉపాధి పొందేందుకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించి, 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హుల‌ని తెలిపారు. మరిన్ని వివరాల‌కు యెండల‌ టవర్స్‌ సమీపంలోని ప్రధానమంత్రి కౌశల్‌ ...

Read More »

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా జిల్లాకు నియమించబడిన బి.చంద్రశేఖర్‌ బుధవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు ఆర్‌డివోలు వెంకటయ్య, గోపి రామ్‌, శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌డివోలు, కలెక్టరేట్‌లోని పలు విభాగాల‌ పర్యవేక్షకులు, సెక్షన్‌ క్లర్కుల‌తో సమావేశమయ్యారు. వారితో ఆయన మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచడానికి కలెక్టర్‌ గారికి సపోర్ట్‌గా విధులు నిర్వహిద్దామని ఒక టీమ్‌గా పని ...

Read More »