Breaking News

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా జిల్లాకు నియమించబడిన బి.చంద్రశేఖర్‌ బుధవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు ఆర్‌డివోలు వెంకటయ్య, గోపి రామ్‌, శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌డివోలు, కలెక్టరేట్‌లోని పలు విభాగాల‌ పర్యవేక్షకులు, సెక్షన్‌ క్లర్కుల‌తో సమావేశమయ్యారు.

వారితో ఆయన మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచడానికి కలెక్టర్‌ గారికి సపోర్ట్‌గా విధులు నిర్వహిద్దామని ఒక టీమ్‌గా పని చేద్దామని పేర్కొన్నారు. మనం చేసే పనిలో నిబద్ధత ఉండాల‌ని, నిజాయితీ ఉండాల‌ని, 100 శాతం క్రమశిక్షణతో పనిచేయాల‌ని ఆదేశించారు.

కలెక్టరేట్‌ ఫైళ్లన్నీ వేగంగా రావాల‌ని, కరెంట్‌ ఫైల్స్‌ పెండింగ్ వివ‌రాలు అందించాల‌ని ఆదేశించారు. పర్యవేక్షకుల‌తో నేరుగా మాట్లాడడానికి ఇంటర్‌ కం టెలిఫోన్‌ పద్ధతిని ఏర్పాటు చేయాల‌ని సిబ్బందిని ఆదేశించారు.

Check Also

ఆ రెండు క‌ల్లు దుకాణాల‌తో కష్టాలు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర ప్రజల‌కు అసౌకర్యం కలిగిస్తున్న క‌ల్లు దుకాణం ఇక్కడి ...

Comment on the article