Breaking News

గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయానుకునే వారికి శుభవార్త

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయాల‌నుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన మంత్రి కౌశల్‌ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రిన్సిపాల్‌ వాసుదేవరెడ్డి తెలిపారు.

ఎల‌క్ట్రీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వడంతో పాటు గల్ప్‌లోని ప్రముఖ కంపెనీల్లో ఉపాధి పొందేందుకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించి, 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హుల‌ని తెలిపారు. మరిన్ని వివరాల‌కు యెండల‌ టవర్స్‌ సమీపంలోని ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్రంలో సంప్రదించాల‌ని వాసుదేవరెడ్డి తెలిపారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *