Breaking News

ఐఐటీ నీట్‌ క్యాంప్‌కు ఎంపికైన విద్యార్థులు

బీర్కూర్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల‌ పాఠశాల‌ విద్యార్థులు 18 మంది రాష్ట్ర స్థాయి ఐఐటీ నీట్‌ కాంప్‌కు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల‌ కృషి, విద్యార్థుల‌ పట్టుదల వ‌ల్ల ఇంతటి ఫలితం దక్కినట్టు పాఠశాల‌ ప్రిన్సిపాల్‌ వసంత్‌ రెడ్డి తెలిపారు.

ఎంపికైన విద్యార్థులు త్వరలోనే భువనగిరి జిల్లా ఆనంతారంలో ప్రారంభించబడే పాఠశాల‌లో చేరుతారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల‌ను ప్రధానోపాధ్యాయుడు వసంత్‌ రెడ్డి, ఏటిపి రఘునాథ్‌ అభినందించారు. 8వ, 9వ తరగతి నుండి మొత్తం 18 విద్యార్థులు ఎంపికయ్యారని, అభినందనసభలో ఉపాద్యాయులు రజిత, శివ, హిమాని, పుష్పత, సాయిు, సిబ్బంది జమీల్‌ పాల్గొన్నారు.

Check Also

అంబలి కేంద్రం ప్రారంభం

బీర్కూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో పోచారం భాస్కర్‌ రెడ్డి ...

Comment on the article