Breaking News

గ్రామపంచాయతీల‌కు ట్రాక్టర్‌ల అందజేత

రెంజల్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి సొంత ట్రాక్టర్‌ కలిగి ఉండాల‌నే ల‌క్ష్యంతో ట్రాక్టర్‌ల‌ను కొనుగోలు చేయడం జరుగుతుందని మండల‌ ప్రజాపరిషత్‌ అభివృద్ధి అధికారి గోపాల‌కృష్ణ అన్నారు. మండల‌ ప్రజాపరిషత్‌ కార్యాల‌యంలో బుధవారం వీరన్నగుట్ట, అంబేద్కర్‌ నగర్‌, పేపర్‌మిల్‌ గ్రామాల‌కు మంజూరైన ట్రాక్టర్‌ల‌ను తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, ఎంపీడీఓ గోపాల‌కృష్ణ అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీల‌కు ట్రాక్టర్‌ను అందజేయడం అభినందనీయమని ట్రాక్టర్‌ల‌తో పాటు ట్రాలీ, ట్యాంకర్‌ను సమకూర్చుకుని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు వీటిని ఉపయోగించుకోవాల‌ని సర్పంచ్‌కు సూచించారు.

కార్యక్రమంలో ఎంపీఓ గౌస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, పీఆర్‌ ఏఈ లిఖిత, సర్పంచ్‌లు బైండ్ల రాజు, మతురాబాయి, అలిమాబేగం, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Comment on the article