Breaking News

పార్టీల‌కతీతంగా ప్రజల‌ కోసం పని చేద్దాం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వానికి, ప్రజల‌కు మధ్య వారధిగా అందరం కలిసి పని చేద్దామని జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు తెలిపారు. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు.

జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి కూడా హాజరైన ఈ సమావేశం సందర్భంగా గ్రామీణాభివృద్ధి, మిషన్‌ భగీరథ, నీటిపారుదల‌, వ్యవసాయం, మార్కెటింగ్‌ మార్క్‌ఫెడ్‌, పశుసంవర్ధక శాఖ, తదితర శాఖల‌పై చర్చించారు.

ఎమ్మెల్సీ వి.గంగాధర్‌ గౌడ్‌, జడ్‌పిటిసిలు, ఎంపీపిలు పాల్గొన్న సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి పల్లె ప్రగతి, అదేవిధంగా నగర ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళుతున్నారని పార్టీలు ఏమైనప్పటికీ ఎన్నిక వరకే పరిమితం చేసుకుని అనంతరం ఎన్నికైన ప్రతినిధుల‌ను కూడా కలుపుకొని పార్టీల‌కతీతంగా ప్రజల‌ కోసం వారి సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల‌ను జిల్లా స్థాయి నుండి క్రింది స్థాయి వరకు అర్హులైన పేదలందరికీ చేరే విధంగా కృషి చేద్దామని, కలిసి నడుద్దాం అని ఆయన కోరారు.

పెండిరగ్‌లో ఉన్న పెన్షన్లు ఏప్రిల్‌ నుండి వచ్చే అవకాశం ఉన్నదని ఎడపల్లి ఎంపీపీ వితంతు పెన్షన్‌ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈనె 15న జరిగే సహకార ఎన్నికతో ఎన్నికల‌ ప్రక్రియ పూర్తవుతుందని వచ్చే నాలుగు సంవత్సరాల వరకు అందరి ల‌క్ష్యం సమగ్రమైన పరిపాల‌న వైపు ఉండాల‌ని అందరం కలిసికట్టుగా అత్యంత పేదల‌కు పథకాలు చేరే విధంగా కృషి చేయవల‌సి ఉందని తెలిపారు.

ప్రజాసమస్యలు తెలిసిన ప్రజా ప్రతినిధులు అనుకుంటేనే ఏ కార్యక్రమాలైనా పేదల‌కు చేరుకుంటాయని అధికారులు, ప్రజాప్రతినిధుల ల‌క్ష్యం ఒక్కటే అయినప్పుడు అర్హుల‌కు న్యాయం జరుగుతుందని తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా 530 గ్రామ పంచాయతీల‌కు గాను 528 గ్రామ పంచాయతీలో స్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డు పనులు జరుగుతున్నాయని, 97 గ్రామాల్లో డంపింగ్‌ యాడ్‌కు అటవీ భూమిని కేటాయించడం జరిగిందని వివరించారు.

కంపోస్టు షెడ్డుతో కలిపి డంపింగ్‌ యార్డ్‌లు ఫిబ్రవరి చివరి కల్లా, స్మశాన వాటికలు మార్చి చివరికల్లా పూర్తి చేయించుటకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నవీపేట మండలం మహాంతం గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించకుండానే 1.60 ల‌క్షల‌ రూపాయలు దుర్వినియోగం చేసినట్లు ఎంపీపీ ఫిర్యాదు చేయగా ఎంపీడీవోతో విచారణ చేయించి చర్య‌లు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. అదేవిధంగా రూర్బన్‌ కార్యక్రమానికి ఎడపల్లి మండలం ఎంపిక చేసినందున వచ్చిన నిధుల‌లో 60 శాతం మార్చి చివరికల్లా ఖర్చు చేస్తేనే వచ్చే సంవత్సరం నిధులు మంజూరు చేస్తారని, ఇందుకొరకు సంబంధిత అధికారుకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ గంగాధర్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఉపాధిహామీ ద్వారా పనులు చేయించి కూలీల‌కు పని కల్పించడంతో పాటు సలకాలంలో కూలీ వచ్చే విధంగా చూడాల‌ని ధాన్యం ఆరబోసుకోవడానికి స్థలం లేనందున రైతులు రోడ్లపైన ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారని స్థలాలు ఉన్నచోట ఇందు కొరకు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయాల‌ని ఆయన కోరారు. మిషన్‌ భగీరథలో నీరు తాగడానికి అనుకూంగా ఉండటం లేదని అవసరమైన చోట రిపేరు చేయించాల‌ని ఏర్గట్ల జడ్పిటిసి రాజేష్‌ కోరారు.

గ్రామాల్లో బెల్ట్ షాపుల వ‌ల్ల మ‌హిళ‌లు ఇబ్బంది పడుతున్నారని వాటిని తొగించడానికి చర్యలు తీసుకోవాల‌ని ఇందల్వాయి జడ్పిటిసి కోరారు. నవిపేట మండలంలో చివరి ఆయకట్టుకు నీరు వచ్చే విధంగా చర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత ప్రజాప్రతినిధి కోరారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో గోవింద్‌, సంబంధిత శాఖ అధికారులు రమేష్‌ రాథోడ్‌, రాజేంద్ర ప్రసాద్‌, ఆత్మారాం, గోవింద్‌, రియాజ్‌, జిల్లా అధికారులు తదిత‌రులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌కు శ్రామిక్‌ రైల్‌

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 404 మంది వల‌స కార్మికులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *